Bible Quiz in Telugu Topic wise: 182 || తెలుగు బైబుల్ క్విజ్ ("ఇశ్రాయేలు మూడవ రాజు" అనే అంశము పై బైబిల్ క్విజ్)

1. దావీదు తన తర్వాత తన కుమారుడైన ఎవరిని రాజుగా అభిషేకించెను?
ⓐ సొలొమోను
ⓑ అదోనీయా
ⓒ అమ్నోను
ⓓ దానియేలు
2. దేవునిని సొలొమోను ఏమి అడిగెను?
ⓐ ఐశ్వర్యములు
ⓑ వివేకముగలహృదయము
ⓒ ధనసంపదలు
ⓓ రాజ్య స్థిరత్వము
3. సొలొమోను దేవుని కొరకు ఏమి కట్టించెను?
ⓐ గుడారము
ⓑ నివాసము
ⓒ మందిరము
ⓓ నగరును
4. సొలొమోను మొదట ఏ దేశపురాజు కుమార్తెను వివాహము చేసికొనెను?
ⓐ సిరియ
ⓑ మోయాబు
ⓒ అష్షూరు
ⓓ ఐగుప్తు
5. సొలొమోను యెహోవా యందు ఏమి కలిగి యుండెను?
ⓐ ప్రేమ
ⓑ భయము
ⓒ భక్తి
ⓓ ఇష్టము
6. దేవుడు సొలొమోనుకు ఏమేమి దయ చేసెను?
ⓐ జ్ఞానము
ⓑ బుధ్ధి
ⓒ వివేకముగల మనస్సు
ⓓ పైవన్నీ
7. ఏ దేశపు రాణి సొలొమోను జ్ఞానమును శోధించుటకు వచ్చెను?
ⓐ షెబ
ⓑ తల్మయి
ⓒ తర్టీషు
ⓓ యొప్పే
8. సొలొమోను అన్యులైన ఎంతమంది రాజకుమార్తెలను వివాహము చేసికొనెను?
ⓐ ఆరువందలు
ⓑ ఏడువందలు
ⓒ మూడువందలు
ⓓ రెండువందలు
9. సొలొమోనుకు ఎంతమంది ఉపపత్నులు కలరు?
ⓐ ఒకవంద
ⓑ రెండువందలు
ⓒ మూడువందలు
ⓓ ఐదువందలు
10. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఎవరి తట్టు త్రిప్పెను?
ⓐ తమదేశము
ⓑ తమ అందము
ⓒ తమఐశ్వర్యము
ⓓ ఇతరదేవతల
11. సొలొమోను ఎవరి వలె యధార్ధహృదయముతో యెహోవాను అనుసరింపలేదు?
ⓐ అబ్రాహాము
ⓑ మోషే
ⓒ దావీదు
ⓓ సమూయేలు
12. సొలొమోను హేయమైన దేవతలకు కొండమీద ఏమి కట్టించెను?
ⓐ గుళ్ళు
ⓑ బలిపీఠములు
ⓒ గోపురములు
ⓓ గుడారములు
13. యెహోవా ఎన్నిమార్లు ఇతర దేవతలను అనుసరించవద్దని సొలొమోనుకు ఆజ్ఞాపించెను?
ⓐ మూడు
ⓑ నాలుగు
ⓒ ఐదు
ⓓ రెండు
14. యెహోవా ఆజ్ఞను సొలొమోను ఏమి చేయనందున ఆయన అతని మీద కోపపడెను?
ⓐ విననందున
ⓑ గైకొననందున
ⓒ అనుసరించనందున
ⓓ త్రోసివేసినందున
15. సొలొమోనును రాజ్యము నుండి తొలగించి, యెహోవా ఎవరికి ఆ రాజ్యమును ఇచ్చెను?
ⓐ అతనికుమారునికి
ⓑ అతని భార్యకు
ⓒ అతని స్నేహితునికి
ⓓ అతనిదాసునికి
Result: