Bible Quiz in Telugu Topic wise: 185 || తెలుగు బైబుల్ క్విజ్ ("ఇశ్రాయేలు రెండవ రాజు-2" అనే అంశము పై బైబిల్ క్విజ్)

1. యెహోవా సమూయేలుతో ఎవరి కుమారులలో ఒకని రాజుగా అభిషేకించమని చెప్పెను?
ⓐ తల్మయి
ⓑ హోలయి
ⓒ యెష్షయి
ⓓ బర్జిల్లయి
2. యెష్షయి కుమారులలో ఎవరిని దేవుడు ఎన్నుకొనెను?
ⓐ ఏలీయాబు
ⓑ అబీనాదాబు
ⓒ షమ్మా
ⓓ దావీదు
3. యెష్షయి కుమారులలో దావీదు ఎన్నవవాడు?
ⓐ మూడవ
ⓑ కడసారి
ⓒ మొదటి
ⓓ రెండవ
4. ఎన్నిమార్లు దావీదును చంపవలెనని సౌలు ఈటె విసిరెను?
ⓐ రెండు
ⓑ ఐదు
ⓒ నాలుగు
ⓓ మూడు
5. దావీదు సౌలునకు భయపడి ఏమాయెను?
ⓐ దాగెను
ⓑ నక్కెను
ⓒ పారిపోయెను
ⓓ వణికెను
6. పారిపొయిన దావీదును పట్టుకొనుటకు ఎవరిని పంపెను?
ⓐ యోనాతానును
ⓑ దూతలను
ⓒ సేవకులను
ⓓ పనివారిని
7. తర్వాత సౌలు దావీదును తనే పటుకొనుటకు రామా దగ్గర నున్న ఎక్కడికి వచ్చెను?
ⓐ నయోను
ⓑ నాయోతు
ⓒ నాయీను
ⓓ నిమీము
8. తనను చంపుటకు వచ్చి ఒంటరిగా దొరికిన సౌలును దావీదు ఎన్నిసార్లు విడిచిపెట్టెను?
ⓐ మూడు
ⓑ నాలుగు
ⓒ రెండు
ⓓ ఒకసారి
9. సౌలు నుండి తప్పించుకొని చివరిగా దావీదు ఏ దేశములో నివసించెను?
ⓐ అమోరీయుల
ⓑ ఫిలిష్తీయుల
ⓒ అమ్మోనీయుల
ⓓ సిరియనుల
10. ఫిలిష్తీయుల దేశములో దావీదు ఎంత కాలము యుండెను?
ⓐ ఒక సంవత్సరము
ⓑ మూడు సంవత్సరములు
ⓒ ఒక సంవత్సరము నాలుగునెలలు
ⓓ రెండుసంవత్సరముల మూడునెలలు
11. దావీదు నేను ఎక్కడికి వెళ్ళుదునని, యెహోవాను అడుగగా ఆయన అతనిని ఎక్కడకు వెళ్ళమనెను?
ⓐ షోమ్రోను
ⓑ హెబ్రోను
ⓒ యెరూషలేము
ⓓ సీయోను
12. సౌలు మరణించిన తర్వాత ఎవరు దావీదును రాజుగా అభిషేకము చేసిరి?
ⓐ యూదావారు
ⓑ ఇశ్రాయేలీయులు
ⓒ ఫిలిష్తీయులు
ⓓ అన్యజనులు
13. దావీదు హెబ్రోనులో యూదావారిని, ఇశ్రాయేలు వారిని పరిపాలించిన కాలమెంత?
ⓐ పండ్రెండు సంవత్సరములు
ⓑ ఎనిమిది సంవత్సరముల మూడు నెలలు
ⓒ ఏడు సంవత్సరముల ఆరు నెలలు
ⓓ తొమ్మిది సంవత్సరముల రెండునెలలు
14. సౌలు కుటుంబమునకు దావీదు కుటుంబమునకు ఎంత వరకు యుద్ధము జరిగెను?
ⓐ కొంతకాలము
ⓑ అర్ధకాలము
ⓒ ఒకకాలము
ⓓ బహుకాలము
15. దావీదు తన ఎన్నవ యేండ్ల నుండి యేల నారంభించెను?
ⓐ నలువది
ⓑ ఇరువది
ⓒ యాబది
ⓓ ముప్పది
Result: