Bible Quiz in Telugu Topic wise: 186 || తెలుగు బైబుల్ క్విజ్ ("ఇశ్రాయేలు రెండవ రాజు-3" అనే అంశము పై బైబిల్ క్విజ్)

1. దావీదునకు ఎంతమంది భార్యలు?
ⓐ ఎనిమిది
ⓑ ఆరుగురు
ⓒ ఏడుగురు
ⓓ పది
2. దావీదు భార్యయైన ఎవరు మరణము వరకు పిల్లలను కనక యుండెను?
ⓐ అబీగయీలు
ⓑ మీకాలు
ⓒ అహీనోయము
ⓓ హగ్గీతు
3. నలుదిక్కుల నుండి యెహోవా దావీదుకు శత్రువులపై ఏమి ఇచ్చి,ఏమి కలుగజేసెను?
ⓐ ఆధిక్యము - సౌఖ్యము
ⓑ ఆధిపత్యము- విశ్రాంతి
ⓒ విజయము - నెమ్మది
ⓓ పెత్తనము - పాలన
4. తన ప్రాణస్నేహితుడైన యోనాతానును బట్టి అతని కుమారుడైన ఎవరికి దావీదు ఉపకారము చేసెను?
ⓐ ఇష్యి
ⓑ ఇష్బోషెతు
ⓒ యోషేతు
ⓓ మెఫీబోషెతు
5. దావీదు యెహోవా నివసించుటకు ఏమి కట్టవలెనని అనుకొనెను?
ⓐ మందిరము
ⓑ గుడారాము
ⓒ నివాసము
ⓓ నగరు
6. ఊరీయాను చంపించి అతని భార్యను తన భార్యగా చేసుకొన్న దావీదు యొక్క పని యెహోవా దృష్టికి ఎలా యుండెను?
ⓐ నీచముగా
ⓑ దుష్కార్యముగా
ⓒ దోషముగా
ⓓ పాపముగా
7. ఏ ప్రవక్తను యెహోవా దావీదు నొద్దకు పంపెను?
ⓐ యెహు
ⓑ ఏతాము
ⓒ నాతాను
ⓓ గాదు
8. దావీదు భార్యయైన ఊరీయా భార్య పేరేమిటి?
ⓐ మీకాలు
ⓑ అబీగయీలు
ⓒ అహీనోయము
ⓓ బత్సెబ
9. బతైబ దావీదునకు కనిన కుమారుని పేరేమిటి?
ⓐ సొలొమోను
ⓑ యోనాతాను
ⓒ దానియేలు
ⓓ అదోనీయా
10. తన కుమారుడైన ఎవరి వలన రాజ్యము విడిచిపెట్టి దావీదు పాదరక్షలు లేకుండా ఏడుస్తూ కొండయెక్కెను?
ⓐ అదోనీయా
ⓑ కిల్యాబు
ⓒ అబ్షాలోము
ⓓ అమ్నోను
11. ఆర్కీయుడైన ఎవరు దావీదుతో స్నేహముగా యుండెను?
ⓐ యోనాతాను
ⓑ అహీతో పెలు
ⓒ యోవాబు
ⓓ హుషై
12. అరణ్యములో యున్న దావీదుకు సమస్తసామాగ్రిని సమకూర్చినదెవరు?
ⓐ షోబీయు
ⓑ మాకీరు
ⓒ బర్జిల్లయి
ⓓ పైవారందరూ
13. దావీదు కాలమున ఎన్ని సంవత్సరములు విడువకుండా కరవు సంభవించెను?
ⓐ మూడు
ⓑ నాలుగు
ⓒ ఐదు
ⓓ యేడు
14. రాజైన దావీదు బహువృద్ధుడు కాగా ఎవరిని అతనికి ఆదరించి వెట్ట కల్గించుటకు తెచ్చిరి?
ⓐ మయాశా
ⓑ అబీషగు
ⓒ మెహమేను
ⓓ శెమాయా
15. రాజైన దావీదు ఎన్ని సంవత్సరములు పరిపాలన చేసెను?
ⓐ యాబది
ⓑ ఆరువది
ⓒ ముప్పది
ⓓ నలువది
Result: