Bible Quiz in Telugu Topic wise: 188 || తెలుగు బైబుల్ క్విజ్ ("ఇసుక" అనే అంశము పై బైబిల్ క్విజ్)

1. సముద్రము దాటలేకుండునట్లు నిత్య నిర్ణయముచేత యెహోవా దానికి "ఇసుక"ను ఎలా నియమించెను?
ⓐ గట్టుగా
ⓑ అడ్డుగా
ⓒ సరిహద్దుగా
ⓓ ప్రాకారముగా
2. సముద్రపు "ఇసుక" వలె ఎవరి సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదనని యెహోవా అనెను?
ⓐ ఆదాము
ⓑ అబ్రాహాము
ⓒ నోవహు
ⓓ షేతు
3. ఎవరు ఇశ్రాయేలీయుల మీద యుద్ధమునకై సముద్రపు దరినున్న "ఇసుక"రేణువుల వలె జనమును సమకూర్చుకొనిరి?
ⓐ ఫిలిష్తీయులు
ⓑ ఐగుప్తీయులు
ⓒ అమోరీయులు
ⓓ మోయాబీయులు
4. ఎవరి ఒంటెలు సముద్ర తీరమందలి "ఇసుక" రేణువుల వలె లెక్కింపనొల్లవిగా నుండెను?
ⓐ మిద్యానీయుల
ⓑ అమాలేకీయుల
ⓒ తూర్పు వారి
ⓓ పైవారందరి
5. నా విపత్తు సముద్రముల "ఇసుక"కన్న బరువుగా కనబడునని ఎవరు అనెను?
ⓐ యాకోబు
ⓑ యోబు
ⓒ హిజ్కియా
ⓓ లెమెకు
6. ఎవరు సముద్రతీరమందలి "ఇసుక"రేణువులంత విస్తారమై తినుచు త్రాగుచు సంభ్రమపడుచుండిరి?
ⓐ యూదా ; ఇశ్రాయేలు
ⓑ మోయాబు; ఎదోము
ⓒ ఐగుప్తు ; బబులోను
ⓓ ఆమోరీయ; సిరియ
7. సముద్రపు "ఇసుక"రేణువులను లెక్కింప అసాధ్యమైనట్టుగా ఎవరి సంతానమును విస్తరింపజేతునని యెహోవా అనెను?
ⓐ యిర్మీయా
ⓑ దావీదు
ⓒ హోషేయ
ⓓ యెషయా
8. యెహోవాను విసర్జించిన ఏ దేశములో విధవరాండ్రు సముద్రపు "ఇసుక"వలె విస్తారముగా నుందురు?
ⓐ ఐగుప్తు
ⓑ ఫిలిష్తీయ
ⓒ యెరూషలేము
ⓓ షోమ్రోను
9. ఎవరు ఐగుప్తీయుని చంపి "ఇసుకలో"కప్పిపెట్టెను?
ⓐ హూరు
ⓑ అహరోను
ⓒ కయీను
ⓓ మోషే
10. "ఇసుక"భారము కంటే ఎవని కోపము బరువు?
ⓐ మూర్ఖుని
ⓑ దుష్టుని
ⓒ మూఢుని
ⓓ దుర్మార్గుని
11. ఎవరు "ఇసుక"రేణువులంత విస్తారముగా వచ్చి జనులను చెరపట్టుకొందురు?
ⓐ మోయాబీయులు
ⓑ కల్దీయులు
ⓒ ఎదోమీయులు
ⓓ అనాకీయులు
12. ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు "ఇసుక"వలె నుండినను శేషమే రక్షింపబడునని ఏ ప్రవక్త పలుకుచుండెను?
ⓐ యిర్మీయా
ⓑ హోషేయా
ⓒ యెషయా
ⓓ యెహెజ్కేలు
13. "ఇసుకలో" దాచబడిన రహస్యద్రవ్యములను పీల్చుచున్నదెవరు?
ⓐ గాదు
ⓑ ఆషేరు
ⓒ నఫ్తాలి
ⓓ ఇశ్శాఖారు
14. యెహోవా యొక్క ఏమి "ఇసుక" కంటెను లెక్కకు ఎక్కువై యున్నవి?
ⓐ ఆలోచనలు
ⓑ తలంపులు
ⓒ యోచనలు
ⓓ క్రియలు
15. క్రీస్తు మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు "ఇసుక"మీద ఇల్లు కట్టిన ఎవనిని పోలియుండును?
ⓐ మూర్ఖ చిత్తుని
ⓑ పనికిమాలినవాని
ⓒ భక్తిహీనుని
ⓓ బుద్ధిహీనుని
Result: