Bible Quiz in Telugu Topic wise: 19 || తెలుగు బైబుల్ క్విజ్ ("Day of Patience " సందర్భంగా బైబిల్ క్విజ్)

1. "Patience" అనగా నేమి?
ⓐ సహనము
ⓑ ఓర్పు - ఓపిక
ⓒ సాత్వికము
ⓓ పైవన్నియు
2. ఎవరు సహనము కలిగి జాలి కనికరము కలవాడై యుండెను?
ⓐ యోబు
ⓑ ఆసా
ⓒ హిజ్కియా
ⓓ ఉజ్జీయా
3. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు దేనిని ఓపికతో కనిపెట్టుట మంచిది?
ⓐ ఆశీర్వాదమును
ⓑ ఈవిని
ⓒ రక్షణను
ⓓ వరమును
4. ఏమి సహించిన వాడు ధన్యుడు?
ⓐ వేదన
ⓑ బాధ
ⓒ శ్రమ
ⓓ శోధన
5. సాత్వికమైన మనస్సు శరీరమునకు ఏమై యున్నది?
ⓐ ఆరోగ్యము
ⓑ బలము
ⓒ జీవము
ⓓ ప్రాణము
6. ఓర్పు ఏమి జరుగకుండా చేయును?
ⓐ ఆందోళనలు
ⓑ గొప్పద్రోహకార్యములు
ⓒ కలవరములు
ⓓ జగడములు
7. మనము మేలు చేసి బాధపడినప్పుడు సహించిన దేవునికి అది ఏమగును?
ⓐ హితము
ⓑ ప్రియము
ⓒ ఇష్టము
ⓓ మంచిది
8. ప్రభువు నామమున బోధించిన ఎవరిని ఓపికకు మాదిరిగా పెట్టుకోవాలి?
ⓐ బోధకులను
ⓑ ప్రవక్తలను
ⓒ సేవకులను
ⓓ పరిచారకులను
9. ఓర్చి యోర్చి విసికిన గాని దేవుని మాటలను చెప్పక మాననిదెవరు?
ⓐ యెషయా
ⓑ యెహెజ్కేలు
ⓒ యిర్మీయా
ⓓ యోవేలు
10. ఏది దీర్ఘకాలము సహించును?
ⓐ వాత్సల్యత
ⓑ కనికరము
ⓒ దయ
ⓓ ప్రేమ
11. దేని యందు ఓర్పు గలవారమై యుండవలెను?
ⓐ శ్రమ
ⓑ నిరీక్షణ
ⓒ వాగ్దానము
ⓓ బహుమానము
12. ఏ సంఘము యొక్క సహనమును దేవుడు ఎరిగి యుండెను?
ⓐ ఎఫెసు
ⓑ తుయతైర
ⓒ స్ముర్న
ⓓ సార్ధీస్
13. మన సహనమును ఎవరికి తెలియబడనియ్యవలెను?
ⓐ అధిపతులకు
ⓑ న్యాయాధిపతులకు
ⓒ సకలజనులకు
ⓓ బోధకులకు
14. యెహోవా కొరకు సహనముతో ఏమి చేయాలి?
ⓐ ఎదురుచూడాలి
ⓑ వెంబడించాలి
ⓒ వెదకాలి
ⓓ కనిపెట్టుకోవాలి
15. సాత్వికులు ధన్యులై ఏమి స్వతంత్రించుకొందురు?
ⓐ రాజ్యములను
ⓑ దేశములను
ⓒ రాష్ట్రములను
ⓓ భూలోకమును
Result: