Bible Quiz in Telugu Topic wise: 191 || తెలుగు బైబుల్ క్విజ్ ("ఉత్తరము(North)" అనే అంశము పై బైబిల్ క్విజ్)

1. ఉత్తరదిక్కున మహారాజు పట్టణమైన ఏమి కలదు?
ⓐ మీసారు కొండ
ⓑ హెష్బోను పర్వతము
ⓒ సీయోను పర్వతము
ⓓ సీనాయి కొండ
2. ఉత్తరదిక్కు నుండి ఏమి పుట్టును?
ⓐ సూర్యకాంతి
ⓑ చంద్రుని తేజము
ⓒ నక్షత్రకిరణము
ⓓ సువర్ణప్రకాశము
3. ఉత్తరదేశము నుండి యెహోవా ఏమి చాపును?
ⓐ తన హస్తము
ⓑ తన రెక్కలు
ⓒ తన గుడారము
ⓓ తన పరదా
4. ఉత్తరదిక్కు నుండి ఏమి వచ్చును?
ⓐ మంచు
ⓑ చలి
ⓒ వేడి
ⓓ హిమము
5. ఉత్తరదిశను యెహోవా ఏమి జరిగించును?
ⓐ కార్యములు
ⓑ క్రియలు
ⓒ పనులు
ⓓ జరుగుబాటులు
6. ఉత్తరదిక్కు నుండి ఏమి వచ్చుచున్నది?
ⓐ అగ్ని
ⓑ మంట
ⓒ వేడి
ⓓ పొగ
7. ఉత్తరపు గాలి వలన ఏమి పుట్టును?
ⓐ వాన
ⓑ వడగాలి
ⓒ తుఫాను
ⓓ వడగండ్లు
8. ఏ రంగు గుర్రముల యొక్క రధములు ఉత్తరదేశమునకు ఎక్కిపోవునవి?
ⓐ తెల్లని
ⓑ నల్లని
ⓒ పాండురవర్ణము
ⓓ ఎర్రని
9. ఉత్తర దిక్కున ఏ నదీతీరమందు అన్యజనులు తొట్రిల్లిపడుచున్నారు?
ⓐ నైలు
ⓑ పీషోను
ⓒ యూఫ్రటీస్
ⓓ హిద్దెకెలు
10. యెహోవా మాట వెదకుటకు జనులు ఉత్తరదిక్కు నుండి ఎక్కడి వరకు సంచరించుదురు?
ⓐ పడమర దిక్కు
ⓑ దక్షిణ దిక్కు
ⓒ వాయువ్యము
ⓓ తూర్పుదిక్కు
11. ఉత్తరపు వైపు తేరి చూడుమని యెహోవా ఎవరికి సెలవిచ్చెను?
ⓐ యిర్మీయాకు
ⓑ యెషయాకు
ⓒ యెహెజ్కేలుకు
ⓓ యోవేలుకు
12. బలిపీఠపు ఉత్తరదిక్కున యెహోవా సన్నిధిని దేనిగా అర్పించునది వధింపవలెను?
ⓐ నైవేద్యము
ⓑ దహనబలి
ⓒ సమాధానబలి
ⓓ కృతజ్ఞతాబలి
13. దేని చుట్టూ తిరిగిన కాలము చాలును,ఉత్తర దిక్కుకు తిరుగుడని యెహోవా జనులకు సెలవిచ్చెను?
ⓐ మన్నెము
ⓑ అరణ్యము
ⓒ యెడారి
ⓓ మైదానము
14. ఉత్తరదిక్కున యున్న రాజ్యముల యొక్క ఎవరిని పిలిచెదనని యెహోవా అనెను?
ⓐ రాజులను
ⓑ సైన్యమును
ⓒ సర్వవంశస్థులను
ⓓ అధిపతులను
15. ఉత్తరపు గుమ్మము మార్గముగా మందిరము ఎదుట యెహోవా యొక్క దేనితో మందిరము నిండియుండెను?
ⓐ ప్రభావముతో
ⓑ స్వరముతో
ⓒ పరిమళముతో
ⓓ తేజోమహిమతో
Result: