Bible Quiz in Telugu Topic wise: 192 || తెలుగు బైబుల్ క్విజ్ ("ఉత్సాహధ్వని" అను అంశముపై బైబిల్ క్విజ్)

1 . యెహోవా గుడారములో నేను "ఉత్సాహధ్వని "చేయుచు బలులు అర్పించెదనని ఎవరు అనెను?
ⓐ దావీదు
ⓑ యాకోబు
ⓒ యోసేపు
ⓓ ఆసాపు
2 . యెహోవా గూర్చి ఏమి పాడి "ఉత్సాహధ్వనితో "ఇంపుగా వాయించవలెను?
ⓐ స్తుతిపాట
ⓑ నూతన కీర్తన
ⓒ స్తోత్రగీతము
ⓓ ధనుర్గతము
3. దేనిని యెహోవా నన్ను గూర్చి "ఉత్సాహధ్వని"చేయమనెను?
ⓐ ఎదోమును
ⓑ మోయాబును
ⓒ ఫిలిష్తియాను
ⓓ తూరును
4. యెహోవా యొక్క ఎక్కడ శరణుజొచ్చి "ఉత్సాహధ్వని"చేయవలెను?
ⓐ బాహువు చెంత
ⓑ పాదముల వద్ద
ⓒ రెక్కల చాటున
ⓓ చేతి క్రింద
5. ఎవరు యెహోవాను గూర్చి సంతోషించుచు "ఉత్సాహధ్వని"చేయుదురు?
ⓐ గొప్పవారు
ⓑ జనములు
ⓒ అన్యులు
ⓓ బీదవారు
6. యెహోవా విమోచించిన ఏది ఆయనను గూర్చి "ఉత్సాహధ్వని"చేయును?
ⓐ ప్రాణము
ⓑ దేహము
ⓒ శరీరము
ⓓ మనస్సు
7. యెహోవా నామమును బట్టి ఏమి "ఉత్సాహధ్వని"చేయుచున్నవి?
ⓐ హోరేబు కర్మెలులు
ⓑ తాబోరు హెర్మోనులు
ⓒ మిసారు గిలాదు
ⓓ గిల్గాలు ఆషోరు
8. ఎవరి దేవునిని బట్టి "ఉత్సాహధ్వని" చేయవలెను?
ⓐ ఇస్సాకు
ⓑ సమూయేలు
ⓒ యాకోబు
ⓓ దావీదు
9 . యెహోవాను గూర్చి "ఉత్సాహధ్వని"చేసి మనకు ఏమై యున్న ఆయనను బట్టి సంతోషగానము చేయవలెను?
ⓐ కరుణాధారము
ⓑ ప్రాకారము
ⓒ ఆశ్రయకేడెము
ⓓ రక్షణ దుర్గము
10 . యెహోవా సన్నిధిని ఏమన్నియు "ఉత్సాహధ్వని"చేయును?
ⓐ పొలములన్నియు
ⓑ మైదానములన్నియు
ⓒ వనవృక్షములన్నియు
ⓓ అరణ్యములన్నియు
11. యెహోవా సన్నిధిని ఏమి కూడి "ఉత్సాహధ్వని"చేయును?
ⓐ మెట్టలు
ⓑ గుట్టలు
ⓒ గిరులు
ⓓ కొండలు
12. సమస్తమైన వేటిని యెహోవాకు "ఉత్సాహధ్వని"చేయుమని కీర్తనాకారుడు అనెను?
ⓐ దేశములను
ⓑ నగరులను
ⓒ పట్టణములను
ⓓ రాష్ట్రములను
13. తాను ఏర్పర్చుకొనిన వారిని యెహోవా ఉత్సాహధ్వనితో " ఎక్కడికి రప్పించెను?
ⓐ బయటకు
ⓑ వెలుపలికి
ⓒ మైదానముకు
ⓓ అరణ్యముకు
14. "ఉత్సాహధ్వనితో"యెహోవా యొక్క వేటిని ప్రకటించవలెను?
ⓐ వాగ్దానములను
ⓑ నిబంధనలను
ⓒ కార్యములను
ⓓ ఉపదేశమును
15. నా యొక్క దేనిని బట్టి ఆనందించువారు "ఉత్సాహధ్వని"చేయుదురని దావీదు అనెను?
ⓐ యధార్ధతను
ⓑ గొప్పతనమును
ⓒ ఔన్నత్యమును
ⓓ నిర్దోషత్వమును
Result: