1. ఎవరు "ఉదయము"నందు ఎరను తినును?
2. ఉదయమునందు ఎప్పుడు లేచి మోషే రెండురాతిపలకలను చేతపట్టుకొని సీనాయి కొండ యెక్కెను?
3 ప్ర. సాయంకాలము మొదలుకొని "ఉదయము"వరకు దీపము వెలుగునట్లుగా ఎవరు దాని చక్కపరచవలెను?
4 ప్ర. సాయంకాలము మొదలుకొని "ఉదయము"వరకు ఎటువంటి ఆకారము మందిరము మీద నుండెను?
5ప్ర. యెహోవా మాట వినని యెడల కలుగు భయము చేత "ఉదయమున"అయ్యో ఎప్పుడు సాయంకాలమగునని ఎవరు ఆనుకొందురు?
6."ఉదయమున"ఎవరు లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తికొని మోసిరి?
7."ఉదయమున"ఎవరి ఉపపత్ని యింటి ద్వారము నొద్ద పడియుండెను?
8 . రూతు వచ్చి "ఉదయము"మొదలుకొని బోయజు పొలములో ఏమి ఏరుకొనుచుండెను?
9 ప్ర.నీవు "ఉదయమున "జాగ్రత్తపడి ఎక్కడ దాగియుండమని యోనాతాను దావీదుతో అనెను?
10 ప్ర. జగడమునకు నీవు పిలువక పోయిన యెడల "ఉదయముననే"జనులందరు తిరిగిపోవుదురని యోవాబు ఎవరితో అనెను?
11 . ఎవరు పిలిచిన బయలు ప్రవక్తల "ఉదయము"మొదలుకొని మధ్యాహ్నము వరకు దాని ప్రార్ధించిన ప్రత్యుత్తరమిచ్చువాడు లేకపోయెను?
12 . యెహోవా త్రవ్వమనిన గుంటలలో నీళ్ళమీద సూర్యుడు ప్రకాశింపగా"ఉదయమునందు" ఎవరికి ఆ నీళ్ళు రక్తము వలె కనబడెను?
13. ఉదయమున"అస్తమయమునఆనుదినము దహనబలి యెహోవాకు అర్పించుటకై ఎవరు యాజకులను నియమించెను?
14 ప్ర."ఉదయము"అయినప్పుడు ప్రధానయాజకులు ప్రజల పెద్దలు యేసును చంపవలెనని ఆయనను బంధించి ఎవరికి ఆప్పగించిరి?
15."ఉదయమున"నీ యొక్క దేనితో మమ్మును తృప్తిపరచుమని మోషే యెహోవాకు ప్రార్ధించెను?
Result: