Bible Quiz in Telugu Topic wise: 197 || తెలుగు బైబుల్ క్విజ్ ("ఉరి" అనే అంశము పై క్విజ్)

1. ఎవరిని "ఉరి"తీయుటకు హామాను ఉరికొయ్య ఏర్పర్చెను?
ⓐ రాజును
ⓑ ఎస్తేరును
ⓒ హేగేను
ⓓ మొర్డెకైను
2. వేటిని దేవాలయములో పారవేసి పోయి ఇస్కరియోతు యూదా "ఉరి" పెట్టుకొనెను?
ⓐ బంగారు నాణెములు
ⓑ రాగి నాణెములు
ⓒ వెండి నాణెములు
ⓓ ఇత్తడి నాణెములు
3. "ఉరి" యొద్దకు పక్షి త్వరపడునట్లు ఏమి లేని వాడు వేశ్యవేషము వేసుకొనిన స్త్రీ వెంట వెళ్ళెను?
ⓐ వివేచన
ⓑ బుధ్ధి
ⓒ జ్ఞానము
ⓓ వినయము
4. ఎవరు చాటుగా "ఉరులు" నొడ్డుటకు యోచించుదురు?
ⓐ శత్రువులు
ⓑ దుర్మార్గులు
ⓒ చోరులు
ⓓ లోభులు
5. దేని వలన దోషము అపాయకరమైన "ఉరి"?
ⓐ హృదయము
ⓑ పెదవులు
ⓒ యోచనలు
ⓓ మాటలు
6. నా ప్రాణము తీయజూచు వారు "ఉరులు" ఒడ్డుచున్నారని ఎవరు అనెను?
ⓐ యోబు
ⓑ హిజ్కియా
ⓒ దావీదు
ⓓ సొలొమోను
7. "లు" ఎవరి మార్గములో ఉన్నవి?
ⓐ దూషకుల
ⓑ మూఢుల
ⓒ వ్యర్ధుల
ⓓ మూర్ఖుల
8. ఏమి గలవాని మార్గములను అనుసరించిన ప్రాణమునకు "ఉరి" తెచ్చుకొందురు?
ⓐ కోపము
ⓑ ఆగ్రహము
ⓒ క్రోధము
ⓓ అసూయ
9. ఎవరి మీద యెహోవా "ఉరులు" కురిపించును?
ⓐ పాపుల
ⓑ దుష్టుల
ⓒ లోకుల
ⓓ అన్యుల
10. తన ఆలోచన జరుగక పోవుట చూచిన ఎవరు తన యిల్లు చక్కబెట్టుకొని "ఉరి" పోసి చనిపోయెను?
ⓐ అహీతోపెలు
ⓑ హూషై
ⓒ షిమీ
ⓓ హదదు
11. వరరు తమను హతము చేసిన సౌలును బట్టి ఆతని కుటుంబీకులలో యేడుగురిని యెహోవా సన్నిధిని "ఉరి" తీసిరి?
ⓐ ఆమోరీయులు
ⓑ గిబియోనీయులు
ⓒ రేకాబీయులు
ⓓ హెరాకీయులు
12. ఎవరు అయిదుగురు రాజులను కొట్టి చంపి అయిదు చెట్లు మీద "ఉరి" తీసెను?
ⓐ కాలేబు
ⓑ అహరోను
ⓒ యెహోషువ
ⓓ హోబాబు
13. ఏ "ఉరులు" ఆవరించినపుడు యెహోవాకు ప్రార్ధించగా ఆయన ఆలకించెను?
ⓐ భయంకరమైన
ⓑ భీతిగొలుపు
ⓒ పాతళపు
ⓓ మరణపు
14. ఏమైన విరోధుల భోజనము వారికి "ఉరిగా" నుండును?
ⓐ ధైర్యవంతులైన
ⓑ భీకరులైన
ⓒ నిర్భయులైన
ⓓ శూరులైన
15. ఎవరి "ఉరి" నుండి యెహోవా విడిపించును?
ⓐ దుర్మార్గుల
ⓑ ద్వేషుల
ⓒ వంచకుల
ⓓ వేటకాని
Result: