Bible Quiz in Telugu Topic wise: 200 || తెలుగు బైబుల్ క్విజ్ ("ఊపిరి-2" అనే అంశం పై తెలుగు బైబిల్ క్విజ్)

1: "ఊపిరి" అనగా ఏమిటి?
A శ్వాస
B గాలి
C ప్రాణము
D పైవన్నీ
2. యెహోవా ఊపిరి విడువగా ఏవి సృజించబడెను?
A వృక్షములు
B జలచరములు
C భూజంతువులు
D ఆకాశములు
3 Q. యెహోవా తన నాసికారంధ్రముల ఊపిరి వడిగా విడువగా భూమి యొక్క ఏమి బయలుపడెను?
A ద్వారములు
B జలములు
C పునాదులు
D పొరలు
4 Q. దేవుని ఊపిరి వలన ఏమి పుట్టును?
A మంచు
B ఉరుములు
C వర్షము
D వడగండ్లు
5Q.అబద్ధములాడి ఏమి సంపాదించుట ఊపిరితో సాటి?
A వెండి
B ధనము
C బంగారము
D సంపద
6 Q.నా ఊపిరి నాలో ఎలా యున్నదని యోబు అనెను?
A అధికముగా
B వెల్లువగా
C పూర్ణముగా
D ప్రవాహముగా
7Q. ఎవరి విగ్రహముల నోళ్ళలో ఊపిరి లేశమైనను లేదు?
A అన్యదేశస్థుల
B అన్యరాజుల
C విగ్రహారాధికుల
D అన్యజనుల
8 Q. బలము తొలిగిపోయెను, ఊపిరి విడువక యున్నానని ఎవరు దర్శనము చూచి అనెను?
A దానియేలు
B జెకర్యా
C ఆమోసు
D యెషయా
9 Q. ఒకడు ఊపిరి విడిచిన మాత్రము చేత ఏమన్నియు కొట్టుకొనిపోవును?
A వ్యర్ధమైనవి
B విగ్రహముల గుంపు
C నిష్ ప్రయోజనమైనవి
D లోకపు ఆశలు
10 Q. జలప్రళయములో నాసికారంధ్రములో దేని సంబంధమైన ఊపిరి గల వన్నియు చనిపోయెను?
A శరీరాత్మ
B దేహాత్మ
C జీవాత్మ
D ప్రాణాత్మ
11Q. నాసికారంధ్రములలో ఊపిరి వంటివాడు అని ఎవరి గురించి ప్రవక్త తెలిపెను?
A యేసుక్రీస్తు
B యిర్మియా
C యెషయా
D యెహెజ్కెలు
12 Q. ప్రభువైన యేసు ఎవరిని తన నోటి యూపిరి చేత సంహరించును?
A నాశనపుత్రుని
B ధర్మవిరోధిని
C ఘటసర్పమును
D వినాశపాత్రుని
13 Q. జీవాత్మను ఎటువైపు నుండి వచ్చి హతులైన వీరు బ్రదుకునట్లు వారి మీద ఊపిరి విడువమని యెహోవా సెలవిచ్చెను?
A తూర్పు దిక్కు
B దక్షిణ దిక్కు
C నలుదిక్కుల
D ఉత్తరదిక్కు
14: ఊపిరి ఆత్మీయముగా ఎవరికి సాదృశ్యము?
A పరిశుధ్ధాత్మకు
B వాక్యమునకు
C ప్రవచనమునకు
D లేఖనసత్యములకు
15 Q. ఊపిరి అనే పదము పరిశుద్ధగ్రంధములో ఎన్నిసార్లు కలదు?
A 1224
B 1345
C 1688
D 1726
Result: