1. అబ్రాహాము తన దగ్గర నున్న ఎంతమందితో యుద్ధమునకు వెళ్ళెను?
2. ఏశావు ఎంతమందితో యాకోబును ఎదుర్కొనవచ్చెను?
3. ఎంతమంది పెద్దలు మోషేతో యెహోవా యొద్దకు ఎక్కిపోయిరి?
4. నీళ్ళను చేతితో నోటికందించుకొని గతికిన ఎంతమందితో యుద్ధమునకు వెళ్ళమని యెహోవా గిద్యోనుతో చెప్పెను?
5. సౌలుచేత తరుమబడిన తర్వాత దావీదు నొద్దకు చేరిన వారెంతమంది?
6. సౌలు నొద్దనున్న జనులు ఎంతమంది?
7. యోనాతాను ఎంతమందితో యుద్ధమునకు వెళ్ళెను?
8. ఎంతమంది పారసీకదేశపు రాజుల ఆజ్ఞ వలన యెహోవా మందిరపు పని సమాప్తి చేయబడెను?
9. సొలొమోను పల్లకికి ఎంతమంది శూరులు పరివారము?
10. యెహోవాకు స్తోత్రగానములు చేయు ప్రవీణులైన పాటకులు ఎంతమంది?
11. యెహోవా మందిరములో బూరలు ఊదు యాజకులు ఎంతమంది యుండిరి?
12. కుషీయుడైన జెరహు ఎంతమందితో యూదావారి మీదకు వచ్చెను?
13. నెబుకద్నెజరు యూదులలో మొత్తము ఎంతమందిని చెరగొనిపోయెను?
14. యోబు స్నేహితులు ఎంతమంది ఆయనను చూచుటకు వచ్చిరి?
15. మన ప్రక్క ఎంతమందిపడిన, మన కుడి ప్రక్క ఎంతమంది కూలిన దేవుడు అపాయము రానియ్యడు?
Result: