1. యెహోవా పట్టణమును నాశనము చేయబోవుచున్నాడని చెప్పిన ఎవరు అతని ఆల్లుళ్ళ దృష్టికి "ఎగతాళి"చేయువానివలె నుండెను?
2. నా యొక్క ఎవరు నన్ను "ఎగతాలి" చేయుచున్నారను యోబు అనెను?
3. నన్ను "ఎగతాళి "చేసి నాతో అబద్ధమాడితివని ఎవరు సమ్సోనుతో అనెను?
4. దేవుని మందిరము యొక్క గోడ కట్టుచున్న యూదులను ఎవరు "ఎగతాళి "చేసెను?
5. మా పొరుగువారి దృష్టికి మమ్మును "ఎగతాళికి"కారణముగాను చేసియున్నావని వరు దేవునితో అనెను?
6. ఎవరు "ఎగతాళి"చేయుచు బలత్కారముచేత జరుగు కీడును గూర్చి మాటలాడుకొందురు?
7. మీరెవని గూర్చి "ఎగతాళి"చేయుచున్నారని యెహోవా ఎవరితో అనెను?
8. ఇశ్రాయేలు వారి విరోధులలో వారికి "ఎగతాళి"కలుగునట్లు ఎవరు వారిని విచ్చలవిడిగా తిరుగుటకు విడిచిపెట్టెను?
9. యూదాజనులు ఎవరిని "ఎగతాళి"చేయుచుండెను?
10. నా కన్నా తక్కువ వయస్సు గలవారు నన్ను "ఎగతాళి చేయుచున్నారని ఎవరు అనెను?
11. ఎవరిని చూచి శత్రువులందరు "ఎగతాళి"చేయుదురని యెహోవా సెలవిచ్చెను?
12. మా చుట్టునున్నవారు మమ్ము "ఎగతాళి"చేసెదరని ఎవరు అనెను?
13. అందరు నన్ను "ఎగతాళి"చేయుదురని ఎవరు యెహోవాతో అనెను?
14. ఎవరు మమ్మును చూచి "ఎగతాలి" చేయుదురని సీయోను కుమారి అనెను?
15. నీకు "ఎగతాళి" తటస్థించెను అని యెహోవా ఎవరితో అనెను?
Result: