①. ఎవరి మీద రాజ్య పరిపాలన చేయకమునుపు ఎదోము దేశములో రాజ్యపరిపాలన జరిగెను?
②. ఎదోములో మొదట రాజ్యపరిపాలన చేసిన రాజు బెల ఎవరి కుమారుడు?
③. బెల రాజు ఏ ఊరిలో రాజ్యపరిపాలన చేసెను?
④. బొస్రా వాడైన ఏ రాజు ఎదోములో పరిపాలన చేసెను?
⑤. యేబాబు రాజు ఎవరి కుమారుడు?
⑥. తేమానీయుడైన ఏ రాజు ఎదోమును ఏలెను?
⑦. బదదు కుమారుడైన ఎవరు ఎదోముకు రాజాయెను?
⑧. హదదు రాజు మోయాబునందు దేనిని కొట్టివేసెను?
⑨. హదదు రాజు యొక్క ఊరి పేరు ఏమిటి?
①⓪. మశ్రేక వాడైన ఎవరు ఎదోముకు రాజు ఆయెను?
①①. నదితీరమందలి రహెబోతు వాడైన ఎవరు ఎదోముకు రాజాయెను?
①②. ఎవరి కుమారుడైన బయల్ హానాను ఎదోముకు రాజు ఆయెను?
①③ . ఏ ఊరివాడైన హదదు ఎదోముకు రాజు ఆయెను?
①④. హాదాదు రాజు యొక్క భార్య పేరు ఏమిటి?
①⑤. ఎదోము దేశములో రాజ్యపరిపాలన చేసినవారికి మూలపురుషుడైన ఎదోము ఎవరి కుమారుడు?
Result: