1. అతను ఒక ప్రవక్త అని యెహోవా ఎవరి గురించి చెప్పెను?
2. మోషే ప్రవక్త ఏ కొండ మీది శిఖరమునుండి కనాను దేశమును చూచెను?
3. దావీదును మొదటగా హెచ్చరించిన ప్రవక్త ఎవరు?
4. ఆహాబు రాజు నొద్దకు వచ్చిన ప్రవక్త ఎవరు?
5. ఏలీయా శిష్యుడైన ప్రవక్త ఎవరు?
6. ఇశ్రాయేలు రాజైన యరొబాము గురించి ప్రవచించిన ప్రవక్త ఎవరు?
7. ఆసా రాజు యొద్దకు వచ్చి యెహోవా వాక్కును చెప్పిన ప్రవక్త ఎవరు?
8. యెరూషలేము గోడను బాగుచేసిన ప్రవక్త ఎవరు?
9. ఏ ప్రవక్త సింహపుబోనులో వేయించబడెను?
10. ఏ ప్రవక్త వ్యభిచారిని పెండ్లిచేసుకొనెను?
11. పసుల కాపరియై మేడిపండ్లు ఏరుకొను ఎవరిని దేవుడు ప్రవక్తగా చేసెను?
12. ఇశ్రాయేలును ఏలబోవువాడు బెత్లహేము ఎఫ్రాతా నుండి వచ్చునని ప్రవచించిన ప్రవక్త ఎవరు?
13. నీనెవె గూర్చిన దేవోక్తి చెప్పిన ప్రవక్త ఎవరు?
14. యెహోవా యందు ఆనందించెదను ఆనిన ప్రవక్త ఎవరు?
15. దేశముల గురించి దర్శనములు కనిన ప్రవక్త ఎవరు?
Result: