Bible Quiz in Telugu Topic wise: 213 || తెలుగు బైబుల్ క్విజ్ ("ఎలుగెత్తి" అనే అంశము పై క్విజ్)

1. నన్ను కూడా దీవించమని ఎవరు తన తండ్రితో చెప్పి "ఎలుగెత్తి" ఏడ్చెను?
ⓐ ఇష్మాయేలు
ⓑ యోసేపు
ⓒ ఆసాపు
ⓓ ఏశావు
2 . యాకోబు ఎవరిని ముద్దు పెట్టుకొని "ఎలుగెత్తి" యేడ్చెను?
ⓐ ఇస్సాకును
ⓑ రిబ్కాను
ⓒ రాహేలును
ⓓ లాబానును
3 . ఎవరు "ఎలుగెత్తి" యేడ్వగా ఐగుప్తీయులును ఫరో యింటివారందరును వినిరి?
ⓐ మోషే
ⓑ యోసేపు
ⓒ అహరోను
ⓓ ఇశ్రాయేలీయులు
4 . ఎవరి యొద్ద ఓర్పా రూతు "ఎలుగెత్తి" యేడ్చిరి?
ⓐ నయోమి
ⓑ మహోను
ⓒ కిల్యోను
ⓓ బోయజు
5 . దావీదు ఎవరి సమాధి దగ్గర "ఎలుగెత్తి" యేడ్చెను?
ⓐ సౌలు
ⓑ అబ్నేరు
ⓒ అబ్షాలోము
ⓓ యోనాతాను
6 . ఎవరు తన కుమారునికెదురుగా కూర్చుండి "ఎలుగెత్తి" యేడ్చెను?
ⓐ సారెపతు స్త్రీ
ⓑ ఆనా
ⓒ హాగరు
ⓓ అజుబా
7 . "ఎలుగెత్తి " యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఎక్కడ నుండి ఉత్తరమిచ్చును?
ⓐ తన ఆలయము
ⓑ ఆకాశము
ⓒ అంతరిక్షము
ⓓ పరిశుద్ధపర్వతము
8 . ఏమి విని సర్వసమాజము "ఎలుగెత్తి" కేకలు వేసిరి?
ⓐ దృష్టాంతములు
ⓑ యుద్ధ ధ్వని
ⓒ చెడు సమాచారము
ⓓ శత్రుసమాచారము
9 . "ఎలుగెత్తి" ఎవరిని పిలిచి వారికి సంజ్ఞ చేయుమని యెషయా దేవోక్తి చెప్పెను?
ⓐ మోయాబును
ⓑ బబులోనును
ⓒ అమోరీయులను
ⓓ సిరియనులను
10 . ఏమి ఊదునట్లు "ఎలుగెత్తి "బిగ్గరగా కేకలు వేయుమని యెహోవా చెప్పెను?
ⓐ తాళక బూర
ⓑ పిల్లనగ్రోవి
ⓒ తంతి వాద్యము
ⓓ స్వరమండలము
11 . ఎవరిలో కొందరు మెట్లమీద నిలువబడి "ఎలుగెత్తి "యెహోవాకు మొర్రపెట్టిరి?
ⓐ సమాజ పెద్దలలో
ⓑ లేవీయులలో
ⓒ శాస్త్రులలో
ⓓ యాజకులలో
12 . ఎవరిని బాగు చేయుమని మోషే "ఎలుగెత్తి"యెహోవాకు మొర్రపెట్టెను?
ⓐ అహరోనును
ⓑ అమ్రామును
ⓒ మిర్యామును
ⓓ హోరేబును
13 . ఏ సమయమును సర్వసమాజము "ఎలుగెత్తి" ఏడ్చిరి?
ⓐ పగలు
ⓑ మధ్యాహ్నము
ⓒ సాయంత్రము
ⓓ రాత్రి
14. "ఎలుగెత్తి" దేవునికి మొర్రపెట్టి మనవి చేసెదనని ఎవరు అనెను?
ⓐ ఏతాము
ⓑ ఆసాపు
ⓒ సొలొమోను
ⓓ దావీదు
15. నేను చెప్పిన యేసు ఈయనే అని ఆయనను చూపి "ఎలుగెత్తి" చెప్పినదెవరు?
ⓐ నతనయేలు
ⓑ నీకొదేము
ⓒ అరిమతయియ యోసేపు
ⓓ బాప్తిస్మమిచ్చు యోహాను
Result: