1. " Praise" అనగా నేమి?
2. దేవునికి స్తోత్రగానము చేయుట ఏమై యున్నది?
3. యెహోవా ఏమి గలిగి ఆశ్రయదుర్గమై యుండెను గనుక ఆయన స్తోత్రార్హుడు?
4. యెహోవా మందిరము యొక్క ఏమి వేయబడుట చూచి,జనులందరు గొప్పశబ్దముతో స్తోత్రము చేసిరి?
5. అధికస్తోత్రము పొందతగిన యెహోవా ఎవరి కంటెను పూజనీయుడు?
6. యెహోవాకృప నిరంతరముండును ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు గాయకులను ఎవరు ఏర్పర్చెను?
7. సకలాశీర్వచన స్తోత్రములకు మించిన యెహోవా నామము ఎటువంటిది?
8. సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని ఎలుగెత్తి చెప్పినదెవరు?
9. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు అని స్తోత్రము చేసినదెవరు?
10. యెరూషలేము ప్రాకారమును ప్రతిష్టించుకాలమున స్తోత్రగీతములతో జరిగించుటకు ఎవరిని రప్పించుటకు పూనుకొనిరి?
11. ఇశ్రాయేలీయుల దేవుని స్తోత్రగీతములను మధురగానము చేసిన గాయకుడెవరు?
12. ఎక్కడ మనుష్యులు యెహోవాకు స్తోత్రము ప్రకటించును?
13. యెహోవాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై ఆయన ఇశ్రాయేలు,యూదా వంశస్థులను నరుని నడుముకు ఏమి అంటియున్న రీతిగా అంటియుండజేసెను?
14. యెహోవాకు ఏమి ఆరోపించి స్తోత్రము చెల్లించాలి?
15. యెహోవా స్తోత్రార్హక్రియలను,బలమును, ఆశ్చర్యకార్యములను ఏమి చేయకుండా మన పిల్లలకు చెప్పవలెను?
Result: