1. యెరూషలేము గుమ్మములన్నియు అగ్నితో కాల్చివేయబడినవని వినిన ఎవరు యేడ్చెను?
2. ఎవరు తన పిల్లల గూర్చి యేడ్చుచుండెను?
3. ఎవరి గూర్చి రాజు కీర్తన పాడగా జనులందరు మరి యెక్కువగా యేడ్చిరి?
4. ఎవరు మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులు ఏడ్చిరి?
5. ఎవరు యోసేపు మెడమీద పడి యేడ్చెను?
6. ఎవరు మహాదుఃఖముతో ఏడ్పుతో రోదనముతో మునిగి యుండెను?
7. ఏ నదుల యొద్ద కూర్చొని సీయోనును జ్ఞాపకము చేసుకొని యూదులు ఏడ్చుచుండిరి?
8. ఎలుగెత్తి యేడ్చిన ఎవరు తన అత్తను హత్తుకొనెను?
9. మీరేల ఏడ్చి నా గుండె బద్దలు చేసెదరని నా పౌలు ఎక్కడ ఉన్నవారితో అనెను?
10. ఎవరు ఏడ్చుట చూచిన యేసు కలవరపడి ఆత్మలో మూల్గెను?
11. ఏ పట్టణమును సమీపించినపుడు యేసు దాని విషయమై ఏడ్చెను?
12. ఎవరు యేడ్చుచు దేవుని మందిరము యెదుట సాష్టాంగపడెను?
13. ఎవరు ఒకరికి ఒకరు ముద్దుపెట్టుకొని ఏడ్చుచుండిరి?
14. ప్రభువు తన వైపు చూడగానే ఆయన చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొని ఎవరు సంతాపపడి ఏడ్చెను?
15. యేసు సమాధి బయట నిలిచి యేడ్చుచున్న మరియ సమాధిలో వంగి చూడగా ఎవరు కనిపించెను?
Result: