1Q. ఎవరు ఒంటరిగా నుండుట మంచిది కాదని దేవుడు అనుకొనెను?
2 Q. "నేను ఒంటరిగా ఉండినను యెహోవా నన్ను సురక్షితముగా నివసింపజేయును"ఈమాట పలికిన వ్యక్తి ఎవరు?
3 Q. ఒంటరిగాడు పడిపోయినయెడల వానికి ఏమి కలుగును?
4. ఒంటరిగా ఉన్న ఎవరిని యెహోవా పిలిచి ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసెను?
5 Q. నేను "ఒంటరినై" గొప్ప దర్శనము చూచినందున నాలో బలమేమియు లేకపోయెను, అని పలికినది ఎవరు?
6Q. ప్రార్ధన చేయుటకు ఏకాంతముగా కొండయెక్కి పోయి,సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉన్నవారు ఎవరు?
7Q. సమూయేలు "ఒంటరిగా"నున్నప్పుడు ఎవరు అతనికి దర్శనమిచ్చుచుండెను?
8."వారిలో ఒంటరియైన వాడు వేయిమందియగును" ఈ వాక్యము రిఫరెన్స్?
9 Q. నీ సహోదరుడు నీయెడల ఏమి చేసిన యెడల నీవు పోయి, నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించవలెను?
10 Q. యౌవన కాలమున కాడి మోయుట నరునికి మేలు గనుక అతడు ఒంటరిగా కూర్చుండి ఏవిధంగా ఉండవలెను?
11Q. ఎవరు నాతో ఉన్నారు గనుక నేను "ఒంటరిగా" లేను అని యేసు తన శిష్యులతో చెప్పెను?
12 Q. నేను నా పిల్లలను పోగొట్టుకొని, "ఒంటరి"కత్తెనై విడువబడితిని అని తన మనస్సులో అనుకొనినది ఎవరు?
13: ఒంటిగా నున్న గోధుమగింజ (విత్తనము) భూమిలోపడిచచ్చిన యెడల ఎలా ఫలించును?
14: నేను "ఒంటరిగా" పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున, నీకు చింతలేదా? అని యేసుని ఎవరు అడిగెను?
15 Q. అబ్రాహాము "ఒంటరి" గా ఉన్నప్పుడు ఇశ్రాయేలు దేశములో ఏమి పొందెను?
Result: