1 . "ఒ౦టె " పూర్వము దేనికి ఉపయోగించెడివారు?
2 . "ఒంటె" నెమరు వేయును గాని దానికి ఏమి లేవు గనుక అది అపవిత్రము?
3 . ఎవరిని బట్టి అబ్రాముకు ఒంటెలు ఇయ్యబడెను?
4 . ఎవరు గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను "ఒంటెల"మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను?
5 . సమాజపు వారి "ఒంటెలు" ఎన్ని?
6 . ఎవరికి మూడు వేల "ఒంటెలు" యుండెను?
7 . ఎవరు జెబహును సల్మున్నాను చంపి వారి "ఒంటెల" మీద నున్న చంద్రహారములను తీసికొనెను?
8 . ఎవరికి వరుసగా వచ్చు "ఒంటెలు"కనబడెను?
9 . ఇశ్రాయేలు ఎక్కడ ఇటు అటు తిరుగు వడిగల "ఒంటె" అని యెహోవా అనెను?
10 . యెహోవా ఏ పట్టణమును "ఒంటెల" సాలగా చేసెదననెను?
11 . ఎవరి "లేత ఒంటెలును "ఇశ్రాయేలు దేశమున వ్యాపించునని యెహోవా సెలవిచ్చెను?
12 . ఎవరు అభివృద్ధి పొంది విస్తారమైన "ఒంటెలు" కలవాడాయెను?
13 . ఇశ్రాయేలీయులు "ఒంటెల"మూపుల మీద తమ యొక్క ఏమి ఎక్కించుకొని ఐగుప్తునకు పోవుదురు?
14 . ఇశ్రాయేలీయుల మీదకు వచ్చిన ఎవరి "ఒంటెలు" సముద్రతీరమందున్న ఇసుకరేణువుల వలె యుండెను?
15 . " ఒంటె" రోమముల వస్త్రమును ఎవరు ధరించుకొనెను?
Result: