Bible Quiz in Telugu Topic wise: 229 || తెలుగు బైబుల్ క్విజ్ ("ఒప్పుకొని"అనే అంశముపై క్విజ్)

1. వేటిని "ఒప్పుకొని "విడిచిపెట్టవలెను?
ⓐ అతిక్రమములను
ⓑ లోకఆచారములను
ⓒ వ్యర్ధప్రయత్నములను
ⓓ సొంతకార్యములను
2. దేనిని కప్పుకొనక యెహోవా యెదుట "ఒప్పుకొన"వలెను?
ⓐ సంకటమును
ⓑ దోషమును
ⓒ మూర్ఖతను
ⓓ మూఢత్వమును
3. మన యొక్క వేటిని "ఒప్పుకొనిన" యెడల దేవుడు మనలను క్షమించును?
ⓐ దురాలోచనలను
ⓑ ఇహలోక క్రియలను
ⓒ పాపములను
ⓓ దుర్మార్గతను
4. ఎవరు దేవుని మందిరము ఎదుట యేడ్చుచు పాపమును "ఒప్పుకొని"ప్రార్ధన చేసెను?
ⓐ యెహోషువ
ⓑ యోషీయా
ⓒ ఎల్కానా
ⓓ ఎజ్రా
5. యెహోవాకు మహిమ చెల్లించి ఆయన యెదుట "ఒప్పుకొని"నీవు చేసిన దానిని మరుగు చేయక తెలుపుమని ఎవరు ఆకానుతో అనెను?
ⓐ కాలేబు
ⓑ ఎలియాజరు
ⓒ ఫీనేహాసు
ⓓ యెహొషువ
6. ఇశ్రాయేలీయులు ఎవరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై తమ యొక్క తమ పితరుల యొక్క పాపములను "ఒప్పుకొనిరి'?
ⓐ భూజనములలో
ⓑ అన్యజనులందరిలో
ⓒ తమ చుట్టునున్న వారిలో
ⓓ ఇతర గోత్రములలో
7. పవిత్రపర్వతము కొరకు యెహోవా యెదుట తన యొక్క తన జనము యొక్క పాపములను "ఒప్పుకొని"నదెవరు?
ⓐ యెషయా
ⓑ యిర్మీయా
ⓒ దానియేలు
ⓓ యెహెజ్కేలు
8. యెహోవా యెదుట "ఒప్పుకొని"చెప్పిన దానినిబట్టి నెహెమ్యాయు జనులును దేనిని చేసుకొని వ్రాయించుకొనిరి?
ⓐ స్థిరతీర్మానము
ⓑ స్థిర నిశ్చయము
ⓒ స్థిరనిర్ణయము
ⓓ స్థిరమైననిబంధన
9. పొంతిపిలాతు నొద్ద ధైర్యముగా "ఒప్పుకొని" క్రీస్తుయేసు సాక్ష్యమిచ్చెనని ఎవరు అనెను?
ⓐ పౌలు
ⓑ పేతురు
ⓒ ఫిలిప్పు
ⓓ ప్రొకోరు
10. దేనిని పొందుటకు పిలువబడిన తిమోతి అనేక సాక్షుల యెదుట మంచి ఒప్పుకోలు "ఒప్పుకొనెను"?
ⓐ స్వాస్థ్యమును
ⓑ నిత్యజీవమును
ⓒ నిధులను
ⓓ ఐశ్వర్యమును
11. మన నిరీక్షణ విషయమై మనము "ఒప్పుకొని"నది ఎలా పట్టుకొనవలెను?
ⓐ గట్టిగా
ⓑ ధృడముగా
ⓒ నిశ్చలముగా
ⓓ నిర్భయముగా
12. పాపములను ఒకనితోనొకడు "ఒప్పుకొను"మని ఎవరు వ్రాసెను?
ⓐ పేతురు
ⓑ పౌలు
ⓒ యోహాను
ⓓ యాకోబు
13. దేవుని నామమును "ఒప్పుకొనుచు" ఏమి అర్పించవలెను?
ⓐ జిహ్వాఫలము
ⓑ నీతిఫలము
ⓒ సత్యఫలము
ⓓ వెలుగుఫలము
14. యేసు ప్రభువని నోటితో "ఒప్పుకొని" ఎక్కడ విశ్వసించిన యెడల రక్షింపబడుదుము?
ⓐ మనస్సునందు
ⓑ హృదయమందు
ⓒ ఆత్మయందు
ⓓ శరీరమందు
15. ఏమైన వాని యొక్క పేరును క్రీస్తు తండ్రి యెదుటను ఆయన దూతల యెదుటను "ఒప్పుకొందు"ననెను?
ⓐ నమ్మినవాని
ⓑ వెంబడించినవాని
ⓒ జయించినవాని
ⓓ సేవచేసినవాని
Result: