Bible Quiz in Telugu Topic wise: 230 || తెలుగు బైబుల్ క్విజ్ ("ఒలీవ చెట్టు"అంశముపై బైబిల్ క్విజ్)

① దేనికి దంచి తీసిన అచ్చము "ఒలీవల"నూనె తేవలెనని ఇశ్రాయేలీయులకు యెహోవా మోషేను ఆజ్ఞాపించమనెను?
Ⓐ దహనబలికి
Ⓑ నైవేద్యముకు
Ⓒ ప్రదీపమునకు
Ⓓ అర్పణములకు
② ప్రతిష్ఠాభిషేక తైలమునకు "ఒలీవ"నూనె సంభారమును ఎంత తీసుకొనుమని యెహోవా మోషేకు సెలవిచ్చెను?
Ⓐ ఐదు పళ్ళును
Ⓑ మూడు పళ్ళును
Ⓒ పది పళ్ళును
Ⓓ ఏడు పళ్ళును
③ "ఒలీవ నూనె"గల దేశము ఏది?
Ⓐ కనాను
Ⓑ హాయి
Ⓒ బేతేలు
Ⓓ ఐగుప్తు
④ ఒలీవ "పండ్లను ఏరు నప్పుడు పరిగె ఎవరికి ఉండవలెనని యెహోవా జనులతో చెప్పెను?
Ⓐ పరదేశులకు
Ⓑ తండ్రిలేనివారికి
Ⓒ విధవరాండ్రకు
Ⓓ పైవారందరికి
⑤ ఎన్ని కెరూబులను సొలొమోను "ఒలీవ"కర్రతో చేయించెను?
Ⓐ మూడు
Ⓑ రెండు
Ⓒ ఆరు
Ⓓ నాలుగు
⑥ దేని ద్వారములకు సొలొమోను "ఒలీవ"కర్రతో తలుపులు చేయించెను?
Ⓐ పట్టణము
Ⓑ నగరు
Ⓒ గర్భాలయపు
Ⓓ ప్రాకరపు
⑦ పరిశుద్ధ స్థలపు ద్వారమునకు సొలొమోను "ఒలీవ"కర్రతో ఏమి చేయించెను?
Ⓐ రెండునిలువుకమ్ములను
Ⓑ రెండు పలకలను
Ⓒ రెండు అడ్డుకమ్ములను
Ⓓ రెండు స్థంభములను
⑧ మీరు మాతో సంధి చేసుకొనిన యెడల "ఒలీవ" తైలము గల దేశమునకు మిమ్మును తీసుకొనిపోదునను అష్షూరురాజు మాట ఎవరు యూదులతో చెప్పెను?
Ⓐ దొయేగు
Ⓑ షిమ్షయి
Ⓒ గెరూజు
Ⓓ రబ్షాకే
⑨ దావీదు రాజు యొక్క "ఒలీవ"తోటల మీద గెదేరీయుడైన ఎవరు నియమింపబడెను?
Ⓐ అజ్రీయేలు
Ⓑ బయల్ హనాను
Ⓒ యహశియేలు
Ⓓ ఓబీలు
①⓪ అడవి "ఒలీవ"చెట్ల కొమ్మలతో ఇశ్రాయేలీయులు ఏమి కట్టుకొనిరి?
Ⓐ పకలు
Ⓑ పర్ణశాలలు
Ⓒ గుడారములు
Ⓓ నివాసములు
①① "ఒలీవ చెట్టు పువ్వులు రాల్చునట్లు యెహోవా నరులను రాల్చునని ఎవరు అనెను?
Ⓐ ఎలీఫజు
Ⓑ బిల్దదు
Ⓒ జోరు
Ⓓ ఎలీహు
①② . "ఒలీవ చెట్లు"దులపగా పైకొమ్మ చివరను రెండు మూడు పండ్లు మిగిలియుండునట్లు ఎవరు యుండునని యెహోవా అనెను?
Ⓐ మోయాబు
Ⓑ దమస్కు
Ⓒ ఎదోము
Ⓓ సీదోను
①③ "ఒలీవ "చెట్టు దులిపినప్పుడు పరిగె పండ్లను ఏరుకొనునప్పుడు జరుగునట్లు భూమి మీద ఎవరిలో జరుగును?
Ⓐ ప్రవక్తలలో
Ⓑ రాజులలో
Ⓒ ప్రధానులలో
Ⓓ జనములలో
①④ ఇశ్రాయేలునకు "ఒలీవ"చెట్టునకు కలిగినంత సౌందర్యము కలుగునని ఎవరు ప్రవచించెను?
Ⓐ హోషేయ
Ⓑ యిర్మీయ
Ⓒ యోవేలు
Ⓓ యెషయా
①⑤ రెండు "ఒలీవ"చెట్లు దీపస్థంభమునకు కుడి ఎడమ ప్రక్కల ఎవరికి కనబడెను?
Ⓐ ఆమోసుకు
Ⓑ హగ్గయికి
Ⓒ జెకర్యాకు
Ⓓ మలాకీకి
Result: