Bible Quiz in Telugu Topic wise: 233 || తెలుగు బైబుల్ క్విజ్ ("కంచె" అను అంశముపై క్విజ్)

1. పడబోవు "కంచెను"ఒకడు పడద్రోయునట్లు మీరందరు ఒకని పడద్రోయచూచుదురని ఎవరు అనెను?
ⓐ యాకోబు
ⓑ యెషయా
ⓒ ఆసాపు
ⓓ దావీదు
2. ఎవరికి కలిగిన సమస్తమునకును చుట్టు "కంచె"వేసితివని యెహోవాతో అపవాది అనెను?
ⓐ అబ్రాహాముకు
ⓑ మోషేకు
ⓒ యోబుకు
ⓓ యెషయాకు
3. ఎవరి మార్గము ముళ్ల "కంచె"?
ⓐ మూర్ఖుని
ⓑ సోమరి
ⓒ దుష్టుని
ⓓ నీచుని
4. "కంచె" కొట్టువానిని ఏమి కరుచును?
ⓐ తేలు
ⓑ ఎండ్రకాయ
ⓒ పాము
ⓓ పురుగు
5. ఏమి కాచిన తన ద్రాక్షాతోట "కంచెను" యెహోవా కొట్టివేసెదననెను?
ⓐ పిచ్చిద్రాక్ష
ⓑ కారుద్రాక్ష
ⓒ చేదుద్రాక్ష
ⓓ ఎండుద్రాక్ష
6. దేవుడు చుట్టు "కంచె"వేసిన వానికి ఏమి ఇయ్యబడదు?
ⓐ ఆహారము
ⓑ పోనీయము
ⓒ వెలుగు
ⓓ వస్త్రము
7. ఏ నివాసులను యెహోవా "కంచె" లలో తిరుగులాడమనెను?
ⓐ తూరు
ⓑ తర్షీషు
ⓒ రబ్బా
ⓓ సీదోను
8. ముండ్ల "కంచెను" ఎవరు వెళ్లు మార్గమునకు అడ్డు వేసెదనని యెహోవా అనెను?
ⓐ ఇశ్రాయేలు ; యూదా
ⓑ తూరు : సీదోను
ⓒ ఐగుప్తు ; మోయాబు
ⓓ ఎదోము ; సిరియ
9. ఎవరు ముండ్ల "కంచె"కంటెను ముండ్లు ముండ్లుగా నుందురు?
ⓐ స్నేహితులు
ⓑ కాపరులు
ⓒ బంధువులు
ⓓ యధార్థవంతులు
10. ఎవరి సైనికులు "కంచె"లలో దిగిన గొంగళిపురుగుల వలె నున్నారు?
ⓐ ఎక్రోను
ⓑ నీనెవె
ⓒ ఎదోము
ⓓ సీనీయ
11. నాకు అడ్డముగా "కంచె"వేసి విషమును మాచిపత్రిని యెహోవా నా చుట్టు మొలిపించియున్నాడని ఎవరు అనెను?
ⓐ షోమ్రోను
ⓑ యెరూషలేము
ⓒ తాబోరు
ⓓ తిర్సా
12. దావీదు "కంచె"లన్నియు నీవు తెగగొట్టియున్నావని ఎవరు యెహోవాతో అనెను?
ⓐ ఏతాను
ⓑ నాతాను
ⓒ ఆసాపు
ⓓ గాదు
13. ఏ ద్రాక్షావల్లులను తాను నాటిన వనము చుట్టు యెహోవా "కంచె"వేసెను?
ⓐ అన్యమైన
ⓑ నిక్కమైన
ⓒ రమ్యమైన
ⓓ అందమైన
14. ఎవరు ద్రాక్షాతోట నాటించి దాని చుట్టు "కంచె"వేయించెను?
ⓐ వ్యవసాయకుడు
ⓑ ఇంటి యజమానుడు
ⓒ సేద్యగాడు
ⓓ తోటమాలి
15. ఒక మనుష్యుడు ద్రాక్షతోట నాటించి "కంచె"వేసి దానిలో ఏమి కట్టించెను?
ⓐ బురుజు
ⓑ కోట
ⓒ గోపురము
ⓓ ఆవరణము
Result: