1. నీ "కటాక్షము"నా మీద నున్న యెడల నీ దాసుని దాటిపోవద్దని యెహోవాతో ఎవరు అనెను?
2 . నీ మీద నాకు "కటాక్షము"కలిగినదని ఎవరితో యెహోవా చెప్పెను?
3 . యెహోవా "కటాక్షము" చేత తృప్తి పొందినదెవరు?
4 . రాజు "కటాక్షము"ఏమై యున్నది?
5 . అనేకులు ఎవరి "కటాక్షము"వెదుకుదురు?
6 . ఇశ్రాయేలీయులకు యెహోవా "కటాక్షము" వలన ఏమి కలుగును?
7 . ఎవరి జనులు "కటాక్షింప"బడలేదు?
8 . తన సహోదరులందరి కంటే "కటాక్షింప" బడినది ఎవరు?
9 . నా యందు ఏమి కలిగి మాటలాడుచున్న దానిని బట్టి నీ "కటాక్షము"కలుగనిమ్మని రూతు బోయజుతో అనెను?
10 . రాజు "కటాక్షము" ఎక్కడ కురియు మంచు వంటిది?
11 . యెహోవా తన "కటాక్షము" చేత దేనికి మేలు చేయును?
12 . తన దాసురాలి దీనస్థితిని యెహోవా "కటాక్షించెనని" ఎవరు అనెను?
13 . కరుణా "కటాక్షము"లను యెహోవా ఎలా యుంచియున్నాడు?
14 . " కటాక్షముంచుమని" ఎలా యెహోవాను బతిమాలుకొనవలెను?
15 . యెహోవా "కటాక్షము"పొందినవాడు ఆయన ముఖము చూచి ఏమి నొందును?
Result: