Bible Quiz in Telugu Topic wise: 235 || తెలుగు బైబుల్ క్విజ్ ("కడుపు" అనే అంశము పై క్విజ్)

1. కడుపును ఏమని పిలుచుదురు?
ⓐ ఉదరము
ⓑ పొట్ట
ⓒ నాభిమండలము
ⓓ పైవన్నియు
2. భోజనపదార్ధములు కడుపునకు ఏమి చేయబడియున్నవి?
ⓐ సిద్ధపరచబడి
ⓑ నియమింపబడి
ⓒ వండబడి
ⓓ వడ్డించబడి
3. మన్నుతింటూ కడుపుతో ప్రాకుదువని దేవుని శాపము పొందిన జంతువేది?
ⓐ మొసలి
ⓑ బల్లి
ⓒ తొండ
ⓓ సర్పము
4. మోయబురాలితో వ్యభిచారము చేసిన ఇశ్రాయేలీయుని,ఆమెను కడుపు గుండా దూసిపోవునట్లు ఈటెతో గుచ్చి చంపినదెవరు?
ⓐ ఫీనేహాసు
ⓑ ఈతామారు
ⓒ ఏలీహు
ⓓ ఎలియాజరు
5. క్రీస్తు సిలువకు ఎలా నడుచుకొనువారికి వారి కడుపే వారి దేవుడు?
ⓐ వ్యతిరేకముగా
ⓑ శత్రువులుగా
ⓒ విరోధముగా
ⓓ అయిష్టముగా
6. కడుపులో జబ్బు కలిగియున్నదెవరు?
ⓐ పౌలు
ⓑ తీతుకు
ⓒ తెరిల్లు
ⓓ తిమోతి
7. అబ్నేరును కడుపులో పొడిచి చంపినది ఎవరు?
ⓐ సౌలు
ⓑ యోవాబు
ⓒ అబీషై
ⓓ బెనాయా
8. ఇశ్రాయేలీయులను బాధించు మోయాబు రాజైన ఎగ్లోనును కడుపులో కత్తి గుచ్చి చంపినదెవరు?
ⓐ గిద్యోను
ⓑ యెఫ్తా
ⓒ షద్గురు
ⓓ ఏహూదు
9. వ్యభిచారమార్గముల యందు నడిచి ఉదరము (కడుపు)లో వ్యాధితో ప్రేగులు పడి చచ్చినదెవరు?
ⓐ యరొబాము
ⓑ యెహొరాము
ⓒ ఏలా
ⓓ తోలా
10. ఎవరి మాట రుచిగలపదార్ధముల వలె కడుపులో దిగిపోవును?
ⓐ మూర్ఖుని
ⓑ మూడుని
ⓒ కొండెగాని
ⓓ చెడ్డవాని
11. . యోనా మూడు రాత్రింబగళ్లు ఎవరి కడుపులో నుండెను?
ⓐ మొసలి
ⓑ ఈల్
ⓒ సీల్
ⓓ తిమింగలము
12. తండ్రిని విడిచి వెళ్ళిన కుమారుడు ఏమితినే పొట్టుతో తన కడుపు నింపుకోవాలనుకొన్నాడు?
ⓐ గేదెలు
ⓑ పందులు
ⓒ ఆవులు
ⓓ మేకలు
13. భక్తిహీనుల, దుష్టుల కడుపులో ఆహారము ఏమగును?
ⓐ పాడైపోవును
ⓑ క్రుళ్ళిపోవును
ⓒ పులిసిపోవును
ⓓ విషమగును
14. నా కడుపు నా కడుపు, నా అంతరంగములో ఎంతో వేదనగా ఉంది అని ప్రలాపిస్తున్నదెవరు?
ⓐ యెహెజ్కేలు
ⓑ యెషయా
ⓒ జెకర్యా
ⓓ యిర్మీయా
15. దేవుడు దేనిని ఆహారముగా తీసుకొని కడుపు నింపుకొనుమని యెహెజ్కేలుతో చెప్పెను?
ⓐ రొట్టెలను
ⓑ మాంసమును
ⓒ తన గ్రంధమును
ⓓ ఆర్పణములను
Result: