1. కన్నీరు అనగా ఏమిటి?
2. కన్నీరు విడిచి బతిమాలుకొని దేవునితో పోరాడినది ఎవరు?
3. యెరూషలేము ప్రాకారములు పడద్రోయబడి దాని గుమ్మములు కాల్చబడెనని వినిన ఎవరు యేడ్చి దుఃఖపడెను?
4. దేవుని మందిరము యెదుట సాష్టాంగపడి యేడ్చుచు తమ పాపములను ఒప్పుకొని ప్రార్ధన చేసినదెవరు?
5. ధర్మశాస్త్రగ్రంధములోని మాటలు విని మెత్తని మనస్సుతో కన్నీరు విడిచిన రాజు ఎవరు?
6. రాత్రింబగళ్ళు నా కన్నీరు నాకు అన్నపానములాయెనని ఆనినది ఎవరు?
7 . ప్రతిరాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నానని ప్రార్ధించినదెవరు?
8 . నా జనులలో హతులైన వారి గూర్చి నేను దివారాత్రులు కన్నీరు విడుచుచున్నానని అన్నది ఎవరు?
9 . ఎవరు ఉపవాసముండి మనోదుఃఖముతో ఏడ్పుతో రోదనముతో మునిగిరి?
10 . ఏమి కలిగి యేడువవలెను?
11. కన్నీళ్ళతో యేసు పాదములను తడిపినది ఎవరు?
12 . ఇప్పుడైనను కన్నీరు విడుచుచు దుఃఖముతో ఎలా దేవుని యొద్దకు రావలెను?
13 . మన కన్నీరు దేవుని యొక్క దేనిలో నుంచబడియున్నవి?
14 . దేవుడు ప్రతి కన్నుల దేనిని తుడిచివేయును?
15 . ఎవరిని దేవుడు నీవిక కన్నీళ్ళు విడువవని ఓదార్చుచుండెను?
Result: