Bible Quiz in Telugu Topic wise: 239 || తెలుగు బైబుల్ క్విజ్ ("కన్నులు" అనే అంశము పై క్విజ్)

1. చూచుటకు ఉపయోగపడే అవయవము ఏమిటి?
ⓐ కన్నులు
ⓑ నేత్రములు
ⓒ నయనములు
ⓓ పైవన్నీ
2. సంఘధువు కన్నులను దేవుడు వేటితో పోల్చెను?
ⓐ గువ్వకండ్లు
ⓑ పిచ్చుక కండ్లు
ⓒ హంసకండ్లు
ⓓ కోవెల కండ్లు
3. నా కన్నులతో కన్యను చూడనని నిబంధన చేసుకొనినదెవరు?
ⓐ దావీదు
ⓑ దానియేలు
ⓒ యోబు
ⓓ యోవేలు
4. ప్రభువు కన్నులు ఎవరి మీద నున్నవి?
ⓐ బుద్ధిమంతుల
ⓑ బలహీనుల
ⓒ ధైర్యవంతుల
ⓓ నీతిమంతుల
5. నీ కన్నులు ఇటు అటు చూడక ఎలా ఉండాలి?
ⓐ నిదానముగా
ⓑ మందిగా
ⓒ సరిగా
ⓓ తిన్నగా
6. శక్యమైతే తమ కన్నులు ఊడబెరికి పౌలునకు ఇచ్చే సంఘమేది?
ⓐ గలతీ
ⓑ ఎఫెసీ
ⓒ కొరింథీ
ⓓ ఫిలిప్పీ
7. లెస్సయైన జ్ఞానము, వివేచన కన్నుల యెదుట నుండి తొలిగిపోకుండా ఏమి చేసుకోవాలి?
ⓐ కాపాడుకోవాలి
ⓑ దాచుకోవాలి
ⓒ భద్రము చేసుకోవాలి
ⓓ పట్టుకోవాలి
8. యాకోబు దేవునికి నివాసస్థలము చూచువరకు నా కన్నులకు నిద్రరానియ్యనని ఎవరు అనెను?
ⓐ నెహెమ్యా
ⓑ దావీదు
ⓒ సొలోమోను
ⓓ ఎజ్రా
9. దేవుని మాటలు మన కన్నుల యెదుట ఎలా ఉండవలెను?
ⓐ ఆకర్షియణముగా
ⓑ రమ్యముగా
ⓒ బాసికములుగా
ⓓ మనోహరముగా
10. ఎవరి కన్నులు భూదింగతములలో ఉండును?
ⓐ మతిహీనుని
ⓑ బుద్ధిహీనుని
ⓒ దుర్మార్గుని
ⓓ భక్తిహీనుని
11. న్యాయసింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో ఏమి చెదరగొట్టును?
ⓐ దుష్టత్వము
ⓑ దుర్నీతి
ⓒ చెడుతనమంతయు
ⓓ పాపమును
12. కన్నీళ్ళు విడువకుండా మన కన్నులను దేవుడు ఏమి చేయును?
ⓐ తప్పించును
ⓑ కాపాడును
ⓒ రక్షించును
ⓓ ఓదార్చును
13. ఎవరు తన కన్నులు ఆశించినవి చూడకుండా అభ్యంతరపరచలేదు?
ⓐ హిజ్కియా
ⓑ అబ్జాలోము
ⓒ సొలోమోను
ⓓ ఉజ్జీయా
14. యెహోవా కన్నులు ఎక్కడ నుండును?
ⓐ ఆకాశముమీద
ⓑ లోకముమీద
ⓒ మనుష్యులమీద
ⓓ ప్రతిస్థలముమీద
15. మన కన్నులు యెహోవా తట్టు జూచినప్పుడు ఆయన ఏమి చేయును?
ⓐ కరుణించును
ⓑ లేవనెత్తును
ⓒ నడిపించును
ⓓ ఆదరించును
Result: