①. "Virgin అనగా అర్ధము ఏమిటి?
②. ఏ "కన్యక "బహుఘోరమైన కార్యము చేసియున్నది?
③. ఏమి కలిగిన "కన్యక"లను వణుకుమని యెహోవా సెలవిచ్చెను?
④. అష్షూరు రాజైన సన్హెరీబును ఏమియైన "కన్యక" దూషణ చేయుచున్నదని యెహోవా సెలవిచ్చెను?
⑤. ఏ "కన్యక "కు సంతోషముండదని యెహోవా సెలవిచ్చెను?
⑥. 'కన్యక ఐనా' నా కుమార్తె నున్నదని యింటి యజమానుడు ఎవరిలోని పోకిరులతో అనెను?
⑦. నీళ్లు చేదుకొను"కన్యక"లు దీర్ఘదర్శియైన సమూయేలు గురించి ఎవరికి చెప్పిరి?
⑧. కాలిమీద బట్ట తీసి నదులు దాటుమని యెహోవా ఏ "కన్యక"తో చెప్పెను?
⑨. యెహోవా "కన్యక"యైన ఎవరిని ద్రాక్షా గానుగలో వేసి త్రొక్కియున్నాడు?
①⓪. ఏ "కన్యక "కు సిగ్గు కలిగిన సంగతి జనములకు వినబడెను?
①①. "కన్యక" ను చూడనని తన కన్నులతో నిబంధన చేసికొనినదెవరు?
12. సమాజములలో దేవుని స్తుతించుటకు "కన్యక"లు ఏమి వాయించుచున్నారు?
①③. యెహోవా తన ప్రజల యొక్క ఏమి కొట్టివేసి ఆనందము కలుగజేయునపుడు "కన్యక" లు నాట్యమందు సంతోషింతురు?
①④. ఇశ్రాయేలీయుల సంతతి "కన్యక"లను ఎవరు పెండ్లిచేసుకొనవచ్చును?
①⑤. పరలోకరాజ్యము పెండ్లికుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన ఎంతమంది "కన్యక"లను పోలియున్నది?
Result: