1. జ్ఞానులు, తల్లియైన మరియను శిశువును చూచి, పూజించి, వేటిని "కానుక" లుగా ఆయనకు సమర్పించిరి?
2. "కానుక "పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటె ఈ బీద విధవరాలు ఎక్కువ వేసెనని' యేసు ఎవరితో చెప్పెను?
3. ఒడిలోనుంచబడిన "కానుక" దేనిని శాంతి పరచును?
4 Q. ఎఫ్రాయిము "కానుక"లు ఇచ్చి ఎవరిని పిలుచుకొనెను?
5Q. ఫిలిష్తీయులలో కొందరు ఎవరికి పన్నును "కానుక"లను ఇచ్చుచు వచ్చిరి?
6Q. యాకోబు తానుసంపాదించిన దానిలో ఎవరి కొరకు ఒక "కానుక"ను తన దాసుల చేతికప్పగించి పంపెను?
7Q. ఎవరు తన కుమారునిచేత వెండి బంగారు ఇత్తడి వస్తువుల "కానుక"లను దావీదు నొద్దకు పంపెను?
8 Q. యెరూషలేములోని దేవుని ఆలయమును బట్టి ఎవరు దేవుని యొద్దకు కానుకలు తెచ్చెదరు?
9Q . ఒకడు ఇచ్చు "కానుక" వానికి ఏమి కలుగజేయును?
10Q. ఎవరు రోగియై, బాగుపడిన సంగతి, బబులోనురాజు విని పత్రికలను "కానుక"ను అతని యొద్దకు పంపెను?
11Q. దరిద్రులకు "కానుక"లను, పంపతగిన దినములను యూదులకు ఎవరు స్థిరపరచెను?
12. నీవు వెళ్ళి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచుకొని మోషే నియమించిన "కానుక" సమర్పించుమని యేసు ఎవరితో చెప్పెను?
13Q. యెహోవామందిర సంబంధమైన వెండి బంగారములను ఆహాజు ఎవరికి "కానుక"గా పంపెను?
14 Q. నీయొద్దకు తెచ్చిన యీ "కానుక"ను నా యేలినవాడవగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించమని ఎవరు దావీదుతో అనెను?
15. కానుక పెట్టెలో తమ "కానుక"లను వేయుచున్న ఎవరిని యేసు పారజూచెను?
Result: