1 ప్ర. యెహోవా నరుని తీసుకొని దేనిని సేద్యపరచు మరియు దాని కాచు పని కొరకు దానిలో ఉంచెను?
2. విచిత్రమైన పనులను కల్పించుటకు యెహోవా ఎవరిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసెను?
3ప్ర. సమస్తమైన పనులలో బహు చమత్కారపు పనివాడు ఎవరు?
4.ఎక్కడ దేవదారు మ్రానులను నరుకు పని నీ సేవకులు నా సేవకులు చేయుదురు అని సొలొమోను తూరు రాజైన హీరాముతో అనెను?
5 . యెరూషలేము గోడలు కట్టు పని యందు మేము బహుగా ప్రయాసపడితిమని ఎవరు అనెను?
6 ప్ర. మా చేతి పనిని స్థిరపరచుమని ఎవరు యెహోవాతో అనెను?
7. యెహోవా దేనిని దాని దాని పని నిమిత్తము కలుగజేసెను?
8ప్ర. పనిలో జాగు చేయువాడు ఏమి చేయువానికి సోదరుడు?
9ప్ర. ఎవరి చేతులు పని చేయనొల్లవు?
10ప్ర. ఏమి లేక పని చేయువానికి నష్టమే ప్రాప్తించును?
11.సోమరి తనను పని పెట్టువారి కండ్లకు ఎటువంటివాడు?
12. స్వహస్తములతో పని చేసి కష్టపడుచున్నామని ఎవరు అనెను?
13. పని చేయనొల్లని వాడు ఏమి చేయకూడదు?
14. సువార్తికుని పని చేయుము అని పౌలు ఎవరితో అనెను?
15Q. పని చేయు వానికి జీతము ఋణమే గాని అది ఏమని ఎంచబడదు?
Result: