Bible Quiz in Telugu Topic wise: 249 || తెలుగు బైబుల్ క్విజ్ ("కాలము" అనే అంశము పై క్విజ్)

1. భూమి నిలిచియున్నంత వరకు ఏమి ఉండకమానవని యెహోవా తన హృదయములో అనుకొనెను?
ⓐ వెదకాలమును ; కోతకాలమును
ⓑ శీతోష్ణములును; వేసవి , శీతాకాలములును
ⓒ రాత్రింబవళ్ళును
ⓓ పైవన్నియును
2. కాలములను సమయములను ఎవరు తన స్వాధీనమందుంచుకొని యుండెను?
ⓐ తండ్రి
ⓑ క్రీస్తు
ⓒ ఆకాశము
ⓓ నక్షత్రమండలము
3. ఏది గతించియున్నది?
ⓐ వేసవికాలము
ⓑ కోతకాలము
ⓒ చలికాలము
ⓓ వర్షాకాలము
4. కోతకాలమునకు ముందు ఎన్ని నెలలు వాన లేకుండా యెహోవా చేసెను?
ⓐ రెండు
ⓑ నాలుగు
ⓒ మూడు
ⓓ అయిదు
5. ఏది గడిచిపోయెను?
ⓐ వేసవికాలము
ⓑ వర్షాకాలము
ⓒ వసంతకాలము
ⓓ చలికాలము
6. అంజూరపు కొమ్మ లేతదై చిగిరించినపుడు ఏది సమీపముగా ఉందని తెలియును?
ⓐ గ్రీష్మ కాలము
ⓑ చలి కాలము
ⓒ వసంతకాలము
ⓓ వర్షాకాలము
7. ఏది జరిగిపోయెను?
ⓐ వర్షాకాలము
ⓑ గ్రీష్మకాలము
ⓒ చలికాలము
ⓓ వెదకాలము
8. యెహోవా దర్శనరీతిగా వేసవికాలపు యొక్క పండ్లగంప ఎవరికి కనుపరచెను?
ⓐ యిర్మీయాకు
ⓑ యెహెజ్కేలుకు
ⓒ ఆమోసుకు
ⓓ జెకర్యాకు
9. ఏది తీరిపోయెను?
ⓐ చలికాలము
ⓑ శీతాకాలము
ⓒ వెదకాలము
ⓓ వర్షాకాలము
10. ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమందు పర్వతముల మీద, యెరూషలేములోను తండ్రిని ఆరాధింపరని యేసు ఎవరితో చెప్పెను?
ⓐ కనాను స్త్రీ
ⓑ సమరయ స్త్రీ
ⓒ విధవరాలు
ⓓ మరియ
11. ఏ నిర్ణయకాలమున జరుగునని హబక్కూకు ప్రవచించెను?
ⓐ తీర్పు
ⓑ దర్శన విషయము
ⓒ న్యాయము
ⓓ ధర్మము
12. కరవు కాలమున జరిగిన దాని గూర్చి యెహోవా వాక్కు ఎవరికి ప్రత్యక్షమాయెను?
ⓐ ఏలీయాకు
ⓑ ఎలీషాకు
ⓒ యిర్మీయాకు
ⓓ యెషయాకు
13. యెహోవా యొక్క దేని యందు ఆనందించువాడు, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును?
ⓐ ఆజ్ఞలు
ⓑ విధులు
ⓒ ఉపదేశము
ⓓ ధర్మశాస్త్రము
14. ఒక కాలము కాలములు అర్ధకాలము ఎవరి యొక్క బలమును కొట్టివేయుట ముగింపబడును?
ⓐ పరిశుద్ధజనము
ⓑ ప్రవక్తల
ⓒ అపొస్తలుల
ⓓ సువార్తికుల
15. అంత్యదినములలో ఎటువంటి కాలములు వచ్చును?
ⓐ దుష్టకరమైన
ⓑ అన్యాయకరమైన
ⓒ అపాయకరమైన
ⓓ చెడ్డకరమైన
Result: