1. "salt" అనగా నేమి?
2 . మనము ఎవరికి "ఉప్పయి"యున్నామని యేసు చెప్పెను?
3 . యెహోవాకు అర్పించు వేటన్నిటిలో "ఉప్పు" ఉండవలెను?
4 . దేని కొరకు అర్పింపబడిన జంతువులను యెహోవా సన్నిధికి తేగా యాజకులు వాటి మీద "ఉప్పు" చల్లి దహనబలిగా అర్పించవలెను?
5 . ఇశ్రాయేలీయుల ఏ సరిహద్దు "ఉప్పు సముద్రము"?
6. "ఉప్పు" లేకపొతే రుచి యుండదని ఎవరు అనెను?
7 . దేని యొక్క జనన విధము చూడగా అది పుట్టినప్పుడు దానికి "ఉప్పు" రాయకపోయిరని ప్రవక్త ప్రవచించెను?
8 . ఏ పట్టణపు నీళ్ళు మంచివి కానపుడు ఎలీషా ఆ నీళ్ళలో "ఉప్పు"వేయగా అవి మంచివాయెను?
9 . ఎవరు పట్టణపు జనులను చంపి ఆ స్థలమున "ఉప్పు" జల్లెను?
10 . యెహోవా యొక్క నిబంధన "ఉప్పు" దేని మీద ఉండవలెను?
11. "ఉప్పు"నీళ్ళలో నుండి ఏ నీళ్ళు ఊరునా అని యాకోబు చెప్పెను?
12 . ఎవరు "ఉప్పులోయలో" సిరియనులను హతము చేసెను?
13 . ఉప్పు ఏమైతే దేనివలనను అది సారము పొందక బయటపారవేయబడును?
14 . బయట పారవేయబడిన "ఉప్పు" ఎవరి చేత త్రొక్కబడును?
15 . మన యొక్క దేనిని "ఉప్పు"వేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగా, కృపాసహితముగా ఉండనియ్యవలెను?
Result: