Bible Quiz in Telugu Topic wise: 250 || తెలుగు బైబుల్ క్విజ్ ("కాళ్ళు" అనే అంశము పై క్విజ్)

1. దేవుడు బొండలలో నా "కాళ్ళు" బిగించియున్నాడని ఎవరు అనెను?
ⓐ యోబు
ⓑ దావీదు
ⓒ యాకోబు
ⓓ యిర్మీయా
2. మోసము చేయువారి "కాళ్ళు" ఎవరిని చంపుటకు త్వరపడుచున్నవని యెహోవా అనెను?
ⓐ పవిత్రులను
ⓑ నిరపరాధులను
ⓒ నీతిమంతులను
ⓓ బుద్ధిమంతులను
3. ఏది యెహోవా "కాళ్ళు" కడుగుకొను పళ్లెము?
ⓐ తూరు
ⓑ కూషు
ⓒ మోయాబు
ⓓ గిలాదు
4. జనులు తమ "కాళ్ళకు" అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఏమి గలవారై యున్నారు గనుక యెహోవా వారిని అంగీకరించడు?
ⓐ కోరిక
ⓑ ఇష్టము
ⓒ వాంఛ
ⓓ యిచ్ఛ
5. కులుకుతూ నడుచుచు తమ "కాళ్ళ"గజ్జలను మ్రోగించినదెవరు?
ⓐ ఎదోము కుమార్తెలు
ⓑ తర్షీషు కుమార్తెలు
ⓒ సీయోను కుమార్తెలు
ⓓ తూరు కుమార్తెలు
6. ఎక్కడ నున్న ఇశ్రాయేలీయుల "కాళ్ళ"కు ఉన్న చెప్పులు పాతగిలిపోలేదు?
ⓐ ఐగుప్తులో
ⓑ అరణ్యములో
ⓒ మైదానములో
ⓓ సముద్రములో
7. ఎవరి "కాళ్ళు" యొర్దాను నది నీటి అంచున మునగగానే ఆ నది నీళ్లు బొత్తిగా ఆపబడెను?
ⓐ పెద్దల
ⓑ యాజకుల
ⓒ యెహోషువ
ⓓ ప్రధానుల
8. రెండు "కాళ్ళు" కుంటివి యైన మెఫీబోషెతు ఎవరి కుమారుడు?
ⓐ ఇష్బోషెతు
ⓑ యోనాతాను
ⓒ మయోను
ⓓ ఇష్వీ
9. "కాళ్ళు"చక్కగా నిలువబడిన ఎన్ని జీవుల రూపములు మానవ రూపములు?
ⓐ అయిదు
ⓑ యేడు
ⓒ నాలుగు
ⓓ ఆరు
10. దానియేలునకు కలిగిన దర్శనములో ఏ జంతువు "కాళ్ళు"నేల మోపకుండా పరుగులెత్తెను?
ⓐ సింహము
ⓑ పొట్టేలు
ⓒ చిరుతపులి
ⓓ మేకపోతు
11. యెహోవాకు పైగా యున్న ఏమి రెండు రెక్కలతో తమ "కాళ్ళు"ను కప్పుకొనుచుండెను?
ⓐ కెరూబులు
ⓑ దేవదూతలు
ⓒ సెరాపులు
ⓓ నాలుగు జీవులు
12. ఎవరి "కాళ్ళు" యొద్ద రూతు పండుకొనెను?
ⓐ బోయజు
ⓑ మహోను
ⓒ నయోమి
ⓓ బంధువు
13. యేసు ఎవరిని బయటకు రమ్మని పిలువగా "కాళ్ళకు" ప్రేతవస్త్రములు చుట్టబడి అతను వెలుపలికి వచ్చెను?
ⓐ నీకోదేము
ⓑ లాజరు
ⓒ యోసేపు
ⓓ బర్తిమయి
14. ఎవరిని చెరసాలలోనికి త్రోసి వారి "కాళ్ళకు" బొండలు బిగించిరి?
ⓐ పేతురు; యోహాను
ⓑ ఆకుల ; తిమోతి
ⓒ పౌలు ; సీల
ⓓ తీతు ; ఎరస్తు
15. "కాళ్ళను" వేటి "కాళ్ళ" యెహోవా చేసియుండెనని దావీదు అనెను?
ⓐ చిరుత పులి
ⓑ దుప్పి
ⓒ పక్షిరాజు
ⓓ జింక
Result: