Bible Quiz in Telugu Topic wise: 26 || తెలుగు బైబుల్ క్విజ్ ("Day of Secret" సందర్భంగా సందర్భంగా బైబిల్ క్విజ్)

1. "secret "అనగా ఏమిటి?
ⓐ రహస్యము
ⓑ మర్మము
ⓒ మరుగు చాటు
ⓓ పైవన్నియు
2. రహస్యములు ఎవరికి చెందును?
ⓐ దేవుడైన యెహోవాకు
ⓑ మనుష్యులకు
ⓒ రాజులకు
ⓓ దేవదూతలకు
3. యెహోవా మరుగు మాటలను మర్మములను ఏమి చేయును?
ⓐ విశదపరచును
ⓑ బయలుపరచును
ⓒ వివరించును
ⓓ వెల్లడిచేయును
4. చాటున ఇచ్చిన బహుమానము దేనిని చల్లార్చును?
ⓐ ఆగ్రహమును
ⓑ అహంకారమును
ⓒ కోపమును
ⓓ గర్వమును
5. యెహోవా మర్మము ఆయన యందు ఏమి గలవారికి తెలిసేయున్నది?
ⓐ వినయము
ⓑ విధేయత
ⓒ నమ్మకము
ⓓ భయభక్తులు
6. ఆత్మ, దేవుని మర్మములను ఏమి చేయుచున్నాడు?
ⓐ పరిశోధించు
ⓑ పరిశీలించు
ⓒ చేధించు
ⓓ బోధించు
7. సంగతి మరుగు చేయుట దేవునికి ఏమై యున్నది?
ⓐ గొప్పతనము
ⓑ ఘనత
ⓒ మహిమ
ⓓ మంచిది
8. ఎవరి చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు?
ⓐ రాజుల
ⓑ అధిపతుల
ⓒ మహోన్నతుని
ⓓ దైవజనుని
9. మరుగు చేయబడిన మర్మమును ఎలా ప్రకటించుటకు పౌలు సంఘమునకు పరిచారకుడాయెను?
ⓐ తేటగా
ⓑ స్పష్టముగా
ⓒ దృష్టాంతముగా
ⓓ సంపూర్ణముగా
10. రహస్యస్థలములలోని మరుగైన దేనిని ఇచ్చెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు?
ⓐ ధనమును
ⓑ విలువైనవి
ⓒ సువర్ణము
ⓓ రత్నములు
11. పరలోకరాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి యున్నదని యేసు ఎవరితో అనెను?
ⓐ తన సోదరులతో
ⓑ తన శిష్యులతో
ⓒ జనసమూహముతో
ⓓ శాస్త్రులతో
12. భాష మాటలాడువాడు దేని వలన మర్మములు పలుకుచున్నాడు?
ⓐ మనస్సు
ⓑ హృదయము
ⓒ ఆత్మ
ⓓ తలంపు
13. దేవుడు ఎవరి ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించును?
ⓐ యేసుక్రీస్తు
ⓑ ప్రవక్తల
ⓒ దేవదూతల
ⓓ దైవజనుల
14. రహస్యమందు చూచుచున్న తండ్రి ఏమి ఇచ్చును?
ⓐ బహుమానము
ⓑ ఈవి
ⓒ ప్రతిఫలము
ⓓ వరము
15. నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చమని ప్రార్ధించనదెవరు?
ⓐ దానియేలు
ⓑ మోషే
ⓒ యిర్మీయా
ⓓ దావీదు
Result: