Bible Quiz in Telugu Topic wise: 262 || తెలుగు బైబుల్ క్విజ్ ("కుడిచెయ్యి" అనే అంశము పై)

1. "కుడిచెయ్యి" అను మాట బైబిల్ నందు ఎన్నిసార్లు కలదు?
ⓐ వంద
ⓑ యాబది
ⓒ ఇరువది
ⓓ అరువది
2. "కుడిచెయ్యిని"ఏమని కూడా పిలుచుదురు?
ⓐ క్రియల హస్తము
ⓑ దక్షిణ హస్తము
ⓒ ఉత్తర హస్తము
ⓓ పెద్ద హస్తము
3. యెహోవా "కుడిచెయ్యి" ఏమి చేయును?
ⓐ హెచ్చించును
ⓑ విడచును
ⓒ ఆదరించును
ⓓ ముడుచును
4. ఎక్కడ నివసించినను యెహోవా "కుడిచెయ్యి"మనలను పట్టుకొనును?
ⓐ అగాధజలములో
ⓑ పాతళములో
ⓒ దొంగ ఊబిలో
ⓓ సముద్రదిగంతములలో
5. ఏమి అవ్వకుము నీకు సహాయము చేసి నీ "కుడిచెయ్యి"పట్టుకొనుచున్నానని యెహోవా అనెను?
ⓐ జడియకుము
ⓑ బెదరకుము
ⓒ భయపడకుము
ⓓ దిగులుపడకుము
6. ఏమి యైన యెహోవా శత్రువులుండగా తన "కుడిచెయ్యి"వెనుకకు తీసియుండెను?
ⓐ ఉగ్రుడైన
ⓑ కోపోద్రేకుడైన
ⓒ రౌద్రుడైన
ⓓ బలుడైన
7. యెహోవా "కుడిచేతి"లో నిత్యము ఏమి కలవు?
ⓐ సుఖములు
ⓑ సమాధానములు
ⓒ కృపావరములు
ⓓ ఐశ్వర్యములు
8. యెహోవా "కుడిచెయ్యి" దేనితో నిండియున్నది?
ⓐ నీతితో
ⓑ శాంతితో
ⓒ సత్యముతో
ⓓ నిధులతో
9. నీ " కుడిచేత"నన్ను రక్షించి నాకుత్తరమిమ్ము అని యెహోవాతో ఎవరు అనెను?
ⓐ ఆసాపు
ⓑ దావీదు
ⓒ ఏతాను
ⓓ సొలొమోను
10. ఏమైన వారిని యెహోవా తన "కుడిచేత" రక్షించును?
ⓐ తనను వేడుకొనువారిని
ⓑ తనను వెంబడించువారిని
ⓒ తన శరణుజొచ్చు వారిని
ⓓ తనకు విన్నవించువారిని
11. నీ "కుడిచేయి" నాటిన మొక్కను కాయుము అని యెహోవాతో ఎవరు అనెను?
ⓐ కోరహు కుమారులు
ⓑ ఏతాను
ⓒ నాతాను
ⓓ ఆసాపు
12. యెహోవా ఎవరి యొక్క కోపము నుండి తన "కుడిచేత" రక్షించును?
ⓐ శత్రువుల
ⓑ పగవారి
ⓒ మూర్ఖుల
ⓓ అసూయపరుల
13. వ్యర్ధమైన పనులు చేయు జనములకు యెహోవా "కుడిచేతి"లోని ఏమి ఇవ్వబడును?
ⓐ దండన
ⓑ పాత్ర
ⓒ కొరడా
ⓓ శిక్ష
14. యెహోవా "కుడిచేయి" వేటిని వ్యాపింపజేయును?
ⓐ ఆకాశనక్షత్రములను
ⓑ పర్వతములను
ⓒ ఆకాశవైశాల్యములను
ⓓ ఎత్తైన కొండలను
15. దేనిని మరచిన యెడల నా "కుడిచెయ్యి" తన నేర్పును మరచును గాక అని కీర్తనాకారుడు అనెను?
ⓐ దేవుని మందిరమును
ⓑ దేవుని ఆజ్ఞలను
ⓒ దేవుని కట్టడలను
ⓓ యెరూషలేమును
Result: