Bible Quiz in Telugu Topic wise: 264 || తెలుగు బైబుల్ క్విజ్ ("కుమారుడు" అనే అంశము పై బైబిల్ క్విజ్)

1. బెత్తము వాడనివాడు తన కుమారునికి ఏమై యున్నాడు?
ⓐ విరోధి
ⓑ శత్రువు
ⓒ పగవాడు
ⓓ ఇష్టుడు
2. కుమారుడు ఎవరు ప్రేరేపింపగా ఒప్పకూడదు?
ⓐ ద్రోహులు
ⓑ పాపులు
ⓒ దొంగలు
ⓓ దుష్టులు
3. కుమారుడు యెహోవా యొక్క వేటిని తన యొద్ద దాచుకొనవలెను?
ⓐ కార్యములను
ⓑ కట్టడలను
ⓒ ఆజ్ఞలను
ⓓ విధులను
4. కుమారుడు యెహోవా యొక్క దేనిని మరువకూడదు?
ⓐ వాగ్దానమును
ⓑ నిబంధనను
ⓒ విధులను
ⓓ ఉపదేశమును
5. కుమారుడు యెహోవా యొక్క వేటికి చెవి యొగ్గవలెను?
ⓐ మార్గములకు
ⓑ ఆలోచనలకు
ⓒ వాక్యములకు
ⓓ యోచనలకు
6. ఏమిగల కుమారుడు తండ్రిని సంతోషపరచును?
ⓐ వినయము
ⓑ జ్ఞానము
ⓒ విధేయత
ⓓ వివేకము
7. తండ్రులు కుమారులకు ఏమై యున్నారు?
ⓐ అలంకారము
ⓑ కిరీటము
ⓒ భూషణము
ⓓ మకుటము
8. కుమారుడు ఏమి పుట్టించు మాటలను మరువకూడదు?
ⓐ గ్రహింపు
ⓑ యోచన
ⓒ తెలివి
ⓓ మంచి
9. కుమారుడు దేవుని మాటలను ఎక్కడ నుంచుకొనవలెను?
ⓐ తలలో
ⓑ కళ్ళల్లో
ⓒ తలంపులో
ⓓ మనస్సులో
10. కుమారుని ప్రేమించువాడు వానిని ఏమి చేయును?
ⓐ శిక్షించును
ⓑ ఎత్తుకొనును
ⓒ ముద్దులిడును
ⓓ హత్తుకొనును
11. కుమారుడు యెహోవా యొక్క శిక్షను ఏమి చేయకూడదు?
ⓐ విడువకూడదు
ⓑ తృణీకరింపకూడదు
ⓒ మరువకూడదు
ⓓ త్రోసివేయకూడదు
12. బుద్ధిలేని కుమారుడు తన తల్లికి ఏమి పుట్టించును?
ⓐ వేదన
ⓑ బాధ
ⓒ దుఃఖము
ⓓ చింత
13. కుమారులు కుమారులు ఎవరికి కిరీటము?
ⓐ ఇంటిపెద్దలకు
ⓑ తల్లి తల్లికి
ⓒ కుటుంబములకు
ⓓ వృద్ధులకు
14. కుమారుడు యెహోవాకు ఏమి ఇయ్యవలెను?
ⓐ బహుమానము
ⓑ హృదయము
ⓒ భాగము
ⓓ కానుక
15. కుమారుడు యెహోవా యొక్క దేనికి విసుకకూడదు?
ⓐ పిలుపునకు
ⓑ స్వరమునకు
ⓒ హెచ్చరికకు
ⓓ గద్దింపునకు
Result: