1. మోయాబు "కుమార్తెలు"ఏమైన వారిలో యున్నారు?
2. సీయోను కుమార్తెలు ఏమియై మెడచాచి నడుచుచున్నారు?
3. తూరు కుమార్తె ఏమి తీసుకొని వచ్చును?
4. ఇశ్రాయేలీయులు తమ కుమార్తెలను ఎవరికియ్యకూడదని ప్రమాణము చేసికొనియుండిరి?
5. నా పట్టణపు కుమార్తెలనందరిని చూచుచు నేను దుఃఖాక్రాంతుడనైతిని అని ఆనినదెవరు?
6. దేనిని ప్రతిష్టించుటకు పెండ్లికుమార్తె తన గదిలో నుండి రావలెను?
7. అంతఃపురములో నుండు రాజకుమార్తె కేవలము ఏమి గలది?
8. నల్లనిదాననైనను ఎటువంటిదాననని షూలమ్మితీ యెరూషలేము కుమార్తెలతో అనెను?
9. యూదా కుమార్తెలు యెహోవా యొక్క వేటిని బట్టి సంతోషించెదరు?
10. సర్వజనుల మీద యెహోవా తన ఆత్మను కుమ్మరించునపుడు జనుల కుమార్తెలు ఏమి చెప్పుదురు?
11. మా కుమార్తెలు నగరునకై చెక్కిన వేటి వలె నున్నారని దావీదు అనెను?
12. స్త్రీలు తమ కుమార్తెలకు ఏమి చేయ నేర్పవలెను?
13. ఎన్ని యేండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన స్త్రీని స్వస్థపరచిన యేసు ఆమెను అబ్రాహాము కుమార్తె అని అనెను?
14. ఎలా యున్న కుమార్తెలను నా మాట వినుడని యెహోవా సెలవిచ్చెను?
15. హోషేయకు పుట్టిన కుమార్తెకు యెహోవా ఏ పేరు పెట్టమనెను?
Result: