1. "LEPROSY" అనగా ఏమిటి?
2.మోషేకు విరోధముగా మాటలాడిన ఎవరికి తెల్లని "కుష్టు రోగము వచ్చెను?
3. "కుష్టు" పొడ గలవానిని ఎవరి యొద్దకు తీసుకొనిరావలెను?
4. "కుష్టు"పొడ గలవానిని ఎన్ని దినములు కడగా యుంచవలెను?
5. ప్రతి "కుష్టరోగిని "పాళెములో నుండి వెలివేయుమని యెహోవా ఎవరికి సెలవిచ్చెను?
6. "కుష్టరోగ" విషయము యాజకుడైన లేవీయులను యెహోవా బోధించు సమస్తము చేయుటకు ఎలా యుండమని మోషే అనెను?
7. దోషము చేసిన ఎవరి ఇంటిలో "కుష్టరోగి" ఉండక మానడని దావీదు అనెను?
8. "కుష్టరోగి"కి పొడగల దినములన్నియు వాడు ఎలా యుండును?
9. " కుష్టురోగి"నివాసము ఎక్కడ ఉండవలెనని యెహోవా సెలవిచ్చెను?
10. నయమాను "కుష్టరోగము"ఏప్రవక్త వలన శుద్ధియాయెను?
11. ప్రభువా, నీకిష్టమైతే నన్ను ఏమి చేయుమని "కుష్టరోగి"యేసును అడిగెను?
12. "కుష్టరోగిని" శుద్ధునిగా చేసిన యేసు ఎవరు నియమించిన కానుకను సమర్పించుమని అతనితో చెప్పెను?
13. గలిలయలో యేసు తమను కరుణించుమనిన ఎంతమంది "కుష్టరోగులను"శుద్ధిచేసెను?
14. ఎవరు తన "కుష్టరోగముకు"స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరచెను?
15. యెహోవా మీద ద్రోహము చేసిన ఎవరికి "కుష్టరోగము"వచ్చెను?
Result: