1. "seeds" అనగా ఏమిటి?
2. విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను దేవుడు ఏ దినమున సృజించెను?
3. విత్తనము వేసిన తర్వాత భూమి మొదట ఏమి ఇచ్చును?
4. ఎవరు విత్తనము వేసి నూరంతల ఫలము పొందెను?
5. ఏది తన పొలములో మంచివిత్తనము విత్తిన యొక మనుష్యుని పోలియున్నది?
6. విత్తనములన్నిటిలో చిన్నదైన దేనితో యేసు దేవుని రాజ్యమును పోల్చెను?
7. విత్తనములిచ్చు వృక్షఫలములు గల ప్రతి వృక్షము మనకు ఏమగునని దేవుడు చెప్పెను?
8. ప్రతి విత్తనమునకు దేవుడు తన చిత్తప్రకారము ఏమి ఇచ్చును?
9. ఫరో కొరకు భూములు కొని ప్రజలకు విత్తనములు ఇచ్చినదెవరు?
10. మంచి విత్తనములు విత్తిన పొలములో ఎవరు గురుగులు విత్తెను?
11. భూమిలో విత్తుటకు గింజలకు కావలసిన దేనిని దేవుడు కురిపించును?
12. ఎన్ని విత్తనములు చేత పట్టి యేడ్చుచు విత్తువాడు సంతోషముతో పనలు మోసుకొని వచ్చును?
13. ఏమి ఫలించునట్లు విత్తనములు వేయవలెను?
14. శాశ్వతమగు ఏమిగల దేవునివాక్య మూలముగా "అక్షయబీజము"నుండి పుట్టినవారము?
15. దేవుడు విత్తనము దయచేసి ప్రతి విషయములో ఏమి గలవారమగునట్లు నీతి ఫలములు వృద్ధిపొందించును?
Result: