Bible Quiz in Telugu Topic wise: 28 || తెలుగు బైబుల్ క్విజ్ ("Day of Smile" సందర్భంగా సందర్భంగా బైబిల్ క్విజ్)

1. "smile" అనగా ఏమిటి?
ⓐ నవ్వు
ⓑ దరహాసము
ⓒ హేల
ⓓ పైవన్నీ
2. దేవుని మాటలు విని సాగిలపడి నవ్వినది ఎవరు?
ⓐ ఆదాము
ⓑ నోవహు
ⓒ అబ్రాహాము
ⓓ హనోకు
3. నేను ఏమి ఉడిగిన దాననని, నా యజమానుడు వృద్ధుడై యున్నాడని శారా నవ్వుకొనెను?
ⓐ వయస్సు
ⓑ దేహము
ⓒ సత్తువ
ⓓ బలము
4. నవ్వు అనే అర్థము వచ్చే ఏ పేరును అబ్రాహాము తన కుమారునికి పెట్టెను?
ⓐ షేతు
ⓑ ఇస్సాకు
ⓒ ఇష్మాయేలు
ⓓ ఇప్పోతు
5. ఎవరు నాకు నవ్వు కలుగజేసెనని శారా అనెను?
ⓐ దేవుడు
ⓑ దూత
ⓒ ఇస్సాకు
ⓓ అబ్రాహాము
6. ఎవరు నా విషయమై నవ్వుదురని శారా అనెను?
ⓐ దాసులు
ⓑ పనివారు
ⓒ వినువారెల్ల
ⓓ స్త్రీలందరు
7. ఒకడు నవ్వుచుండినను ఎక్కడ దుఃఖముండవచ్చును?
ⓐ యోచనలో
ⓑ మనస్సులో
ⓒ లోలోపల
ⓓ హృదయమున
8. ఎక్కడ నుండి యెహోవా రప్పించినపుడు మన నోటి నిండా నవ్వుండెను?
ⓐ ఐగుప్తులో
ⓑ కూపములో
ⓒ చెరలో
ⓓ గోతిలో
9. నవ్వుటకు ఏమి కలదని ప్రసంగి అనెను?
ⓐ ఆనందము
ⓑ సమయము
ⓒ సంతోషము
ⓓ సంగతి
10. ఏమిరేపుచున్న అన్యజనులను చూచి ఆకాశమందు ఆసీనుడైన వాడు నవ్వుచున్నాడు?
ⓐ అల్లరి
ⓑ గల్లత్తు
ⓒ జగడము
ⓓ రగడ
11. తన పొరుగువానిని ఏమి చేసి నవ్వులాటకు చేసితినని వెర్రివాడు అనును?
ⓐ వెక్కిరించి
ⓑ మోసపుచ్చి
ⓒ ఏడిపించి
ⓓ కొట్టి
12. శారా భయపడి ఎవరితో నేను నవ్వలేదనెను?
ⓐ దేవునితో
ⓑ అబ్రాహాముతో
ⓒ దూతతో
ⓓ లోతుతో
13. యెహోవా చెప్పిన బోధ వినక, గద్దింపునకు లోబడక పోయిన వారికి ఏమి కలుగునప్పుడు నవ్వెదనని ఆయన అనెను?
ⓐ భయము
ⓑ అపాయము
ⓒ ఆపద
ⓓ కష్టము
14. ఏడ్చుచున్న మీరు ఎవరై నవ్వుదురని యేసు చెప్పెను?
ⓐ శ్రేష్టులు
ⓑ భాగ్యవంతులు
ⓒ ధన్యులు
ⓓ గొప్పవారు
15. దావీదు కుమారుడైన ఎవరి పేరునకు "నవ్వు" అని అర్దము?
ⓐ షిమ్యా
ⓑ ఎలీషామా
ⓒ నాతాను
ⓓ షోబాబు
Result: