Bible Quiz in Telugu Topic wise: 280 || తెలుగు బైబుల్ క్విజ్ ("కొండలు"అనే అంశముపై బైబిల్ క్విజ్)

1. ఎవరు గిలాదు "కొండ"తట్టు అభిముఖుడై వెళ్ళెను?
ⓐ యాకోబు
ⓑ ఏశావు
ⓒ నిమ్రోదు
ⓓ యాపెతు
2. "కొండల" నుండి ఇశ్రాయేలీయులను కనుగొనుచున్నానని ఎవరు అనెను?
ⓐ మేషా
ⓑ బిలాము
ⓒ ఫరోనెకో
ⓓ యరొబాము
3. "కొండలలో" నుండి పారు ఊటలు గల దేశము కనాను అని ఎవరు అనెను?
ⓐ కాలేబు
ⓑ యెహొషువ
ⓒ మోషే
ⓓ అహరోను
4. కనాను లోని "కొండలలో" నుండి ఏమి త్రవ్వి తీయవచ్చునని మోషే అనెను?
ⓐ ఇత్తడి
ⓑ వెండి
ⓒ తగరము
ⓓ రాగి
5. యెహోషువ శేయీరుకు పోవు ఏ "కొండల"లోని రాజులను పట్టుకొనెను?
ⓐ తిబ్నేరు
ⓑ గోషాను
ⓒ హాలాకు
ⓓ గెశెరు
6. ఏ లోయలో హెర్మోను "కొండ" దిగువనున్న రాజులను యెహోషువ పట్టుకొనెను?
ⓐ గెరారు
ⓑ లెబానోను
ⓒ తాబోరు
ⓓ ఆకోరు
7. ఎవరు యెహోవా "కొండలకు"దేవుడు గాని లోయలకు కాదు అని అనుకొందురు?
ⓐ సిరియనులు
ⓑ ఎదోమీయులు
ⓒ ఫిలిష్తీయులు
ⓓ అమ్మోనీయులు
8. ఇశ్రాయేలీయులు కాపరిలేని గొర్రెల వలె "కొండల"మీద చెదరియుండుట నేను చూచితినని ఎవరు అనెను?
ⓐ సమూయేలు
ⓑ మీకాయా
ⓒ హోషేయా
ⓓ యెషయా
9. ఎన్ని "కొండల"మీద పశువులన్నియు నావే కదా అని యెహోవా అనెను?
ⓐ వేయివేలు
ⓑ నూరు
ⓒ వేయి
ⓓ లక్ష
10. " కొండలు" ఆనందమును ఎలా ధరించుకొనియుండెను?
ⓐ తలపాగా వలె
ⓑ ఉత్తరీయము వలె
ⓒ వస్త్రము వలె
ⓓ నడికట్టువలె
11. ఏమిగల పర్వతములు దేవుడు నివాసముగా కోరుకొనిన "కొండను "ఓరచూపులు చూచుచున్నవి?
ⓐ శిఖరములు
ⓑ విలువైన రాళ్ళు
ⓒ గోమేధికములు
ⓓ రత్నములు
12. "కొండలను" యెహోవా ఎలా చేయును?
ⓐ ధూళి
ⓑ పొట్టు
ⓒ కసువు
ⓓ మన్ను
13. "కొండలు"పుట్టక మునుపే ఉన్నానని ఎవరు అనెను?
ⓐ తెలివి
ⓑ వివేచన
ⓒ జ్ఞానము
ⓓ వేకము
14. యెహోవాకు భయపడి "కొండలు"ఏమగును?
ⓐ పారిపోవును
ⓑ పగిలిపోవును
ⓒ కృంగిపోవును
ⓓ కరిగిపోవును
15. యెహోవా దినమున "కొండలలో" నుండి ఏమి ప్రవహించును?
ⓐ పాలు
ⓑ తేనె
ⓒ నూనె
ⓓ తైలము
Result: