Bible Quiz in Telugu Topic wise: 281 || తెలుగు బైబుల్ క్విజ్ ("కొమ్మలు" అను అంశము పై బైబిల్ క్విజ్)

1. యోసేపు దేని యొద్ద ఫలించెడి "కొమ్మ"?
ⓐ ఊట
ⓑ నీటికాలువల
ⓒ నది యొడ్డున
ⓓ సముద్రతీరమున
2. దేని ప్రక్కల నుండి ఆరు "కొమ్మలు" నిగుడవలెను?
ⓐ బలిపీఠము
ⓑ దీపవృక్షము
ⓒ మందసము
ⓓ సన్నిధిబల్ల
3. ఎప్పుడు గొంజిచెట్ల "కొమ్మలను" పట్టుకొని యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను?
ⓐ ఆరవ దినమున
ⓑ మూడవ దినమున
ⓒ మొదటిదినమున
ⓓ అయిదవ దినమున
4. ఎవరు చెట్లనుండి పెద్ద "కొమ్మను నరికి భుజము మీద పెట్టుకొని, తాను చేసినట్టుగా చేయుమని తన జనులతో చెప్పెను?
ⓐ యెజెరు
ⓑ అదోనియా
ⓒ షీబా
ⓓ అబీమెలెకు
5. ఏది గొప్పమస్తకి వృక్షము యొక్క చిక్కు "కొమ్మల" క్రిందికి పోయినపుడు అబ్దాలోము తల చెట్టుకు తగులుకొనెను?
ⓐ గుర్రము
ⓑ రధము
ⓒ కంచరగాడిద
ⓓ యెడ్ల బండి
6. తన శిష్యుడు నీటిలో గొడ్డలి పడవేసుకొన్న చోట "కొమ్మ"యొకటి నరికి ఆ స్థలములో వేసి గొడ్డలి తేలజేసిన ప్రవక్త ఎవరు?
ⓐ హనానీ
ⓑ ఎలీషా
ⓒ గాదు
ⓓ అహీయా
7. ఏది నా "కొమ్మల"మీద నిలుచును అని యోబు అనెను?
ⓐ మంచు
ⓑ వర్షపు బిందువు
ⓒ నీటి చుక్క
ⓓ హిమము
8. నీ కొరకు నీవు ఏర్పర్చుకొనిన "కొమ్మను" కాయుమని ఎవరు యెహోవాతో అనెను?
ⓐ దావీదు
ⓑ ఆసాపు
ⓒ సొలొమోను
ⓓ నాతాను
9. ఎక్కడ యెహోవా పుట్టించు నీటిబుగ్గల ఒడ్డున వాసము చేయు ఆకాశపక్షులు "కొమ్మల"నడుమ సునాదము చేయును?
ⓐ పర్వతములమీద
ⓑ మైదానములలో
ⓒ కొండలోయలలో
ⓓ అరణ్యములో
10. దుష్టుని "కొమ్మ"వాడిపోవునని ఎవరు అనెను?
ⓐ ఎలీహు
ⓑ బిల్డదు
ⓒ జోఫరు
ⓓ ఎలీఫజు
11. గొప్ప పక్షిరాజు ఏ పర్వతమునకు వచ్చి దేవదారు వృక్షపు పై"కొమ్మను"పట్టుకొనెనని యెహోవా అనెను?
ⓐ మోరీయా
ⓑ గిల్బోవ
ⓒ తాబోరు
ⓓ లెబానోను
12. సీయోను జనులందరు నేను నాటిన"కొమ్మగా" ఉండి దేశమును ఎలా స్వతంత్రించుకొందురని యెహోవా అనెను?
ⓐ సంపూర్ణముగా
ⓑ శాశ్వతముగా
ⓒ మితిలేకుండా
ⓓ సమృద్ధిగా
13. ఎవరు కలలో చూచిన చెట్టు పై"కొమ్మలు"ఆకాశమునంటునంత ఎత్తుగా నుండెను?
ⓐ ఆహష్వేరోషు
ⓑ నెబుకద్నెజరు
ⓒ దర్యావేషు
ⓓ బెల్షస్సరు
14. లెబానోను దేవదారు వృక్షము యొక్క "కొమ్మలు"ఎటువంటివి?
ⓐ సౌందర్యములు
ⓑ విశాలములు
ⓒ సొగసులు
ⓓ శృంగారములు
15. లెక్కలేని బలమైన జనాంగము నా చెట్ల యొక్క ఏమి ఒలిచి పారవేయగా చెట్ల "కొమ్మలు"తెలుపాయెనని యెహోవా అనెను?
ⓐ బెరడు
ⓑ వేరు
ⓒ కాండము
ⓓ చువ్వలు
Result: