Bible Quiz in Telugu Topic wise: 282 || తెలుగు బైబుల్ క్విజ్ ("క్రియలు" అనే అంశము పై బైబిల్ క్విజ్)

1. "సత్ క్రియ" చేసిన యెడల నీవు తలనెత్తుకొనవా; అని దేవుడు ఎవరిని అడిగెను?
ⓐ ఏశావు
ⓑ రూబేను
ⓒ కయీను
ⓓ దాతాను
2. మనము చేసిన తిరుగుబాటు "క్రియలు" దేవుని యెదుట ఎలా యున్నవి?
ⓐ అధికమై
ⓑ గొప్పవై
ⓒ విస్తరించి
ⓓ వ్యాపించి
3. " క్రియలు" లేని విశ్వాసము ఏమై యుండును?
ⓐ మృతము
ⓑ నిష్ఫలము
ⓒ పైరెండు
ⓓ పైవేమీకాదు
4. ఎవరి "క్రియలు" నీతి గలవై యుండెను?
ⓐ హేబెలు
ⓑ నోవహు
ⓒ హనోకు
ⓓ లోతు
5. దేని నుండి మనలను విమోచించి "సత్త్రియలందు" ఆసక్తి గల ప్రజలను దేవుడు తనకోసరము ఏర్పర్చుకొనెను?
ⓐ లోకేచ్ఛల నుండి
ⓑ సమస్తమైన దుర్నీతినుండి
ⓒ శరీరాశల నుండి
ⓓ నేత్రాశల నుండి
6. క్రియలు" జరిగించు విషయములో దేవుడు ఏమై యుండెను?
ⓐ శక్తిసంపన్నుడై
ⓑ బలశాలియై
ⓒ పరాక్రమశాలియై
ⓓ సైన్యాధిపతియై
7. "సత్త్రియలు" ధర్మకార్యములు బహుగా చేసిన స్త్రీ ఎవరు?
ⓐ ఫీబే
ⓑ లుదియ
ⓒ పెర్సిస్
ⓓ తబితా
8. మన "నీతిక్రియలు" ఎటువంటివాయెను?
ⓐ మురికిగుడ్డ
ⓑ మురికిపీలిక
ⓒ చెడువాసన
ⓓ దుర్వాసన
9. పడినస్థితిని జ్ఞాపకము చేసుకొని ఏమి పొంది మొదటి "క్రియలను" చేయవలెను?
ⓐ రక్షణ
ⓑ పశ్చాత్తాపము
ⓒ మారుమనస్సు
ⓓ పాపక్షమాపణ
10. దేవుడు ముందుగా ఏర్పర్చిన "సత్త్రియలు" చేయుటకై, మనము క్రీస్తుయేసునందు ఏమి చేయబడియున్నాము?
ⓐ నిర్మింపబడి
ⓑ చేయబడి
ⓒ లెక్కించబడి
ⓓ సృష్టించబడి
11. క్రీస్తు రక్తము "నిర్జీవక్రియలను"విడిచి ఎవరిని సేవించుటకు మన మనస్సాక్షిని శుద్ధిచేయును?
ⓐ జీవముగల దేవుని
ⓑ మహారాజులను
ⓒ యాజకులను
ⓓ ప్రవక్తలను
12. అన్యజనులు ఏ విషయములో మనలను ఏమని దూషించుదురో, ఆ విషయములో "సత్త్రియలను" చేసి దేవుని ఏమి చేయాలి?
ⓐ పాపులు - స్తుతి
ⓑ దుష్టులు - గానము
ⓒ దుర్మార్గులు మహిమ
ⓓ మోసగాళ్ళు- పొగడుట
13. మాట, నాలుకతో కాక "క్రియ"తోను సత్యముతోను ఏమి చేయుదుము?
ⓐ సేవించుదుము
ⓑ ప్రేమింతుము
ⓒ పొగుడుదుము
ⓓ స్నేహింతుము
14. ఏమి విడిచి హృదయపూర్వకముగా "దుష్క్రియలు" చేయుదురు?
ⓐ సిగ్గు
ⓑ మంచి
ⓒ జ్ఞానము
ⓓ భయము
15. మనము జరిగించు "ఆక్రమక్రియలను"విడిచి" నూతనమైనవేమి తెచ్చుకోవాలి?
ⓐ వస్త్రములు, నగలు
ⓑ హృదయము,బుద్ధి
ⓒ మనసు, ప్రేమ
ⓓ జీవము, సంతోషము
Result: