1. అపొస్తలులకాలములో సంఘము ఎక్కడ కూడుకొనెడివారు?
2 . మొదటి సంఘముగా కూడుకొనినది ఎవరు?
3 . మొదటి సంఘకూడికలో ఇంచుమించు ఎంతమంది సహోదరులు కూడుకొనిరి?
4 . ఎవరు మొదటి సంఘమునకు బోధించెను?
5 . సంఘము మొదట ఎక్కడ కట్టబడెను?
6. క్రీస్తు సంఘములు కట్టబడక మునుపు ఎవరి సమాజమందిరములు యుండెను?
7 . ఏ రాజు సంఘము వారిలో కొందరిని బాధపెట్టుటకు బలత్కారముగా పట్టుకొనెను.
8 . ఎవరెవరి యింట సంఘములు కలవు?
9 . ఏ సంఘములో కలహములు యున్నవని పౌలు వ్రాసెను?
10 . భిన్నమైన సువార్త తట్టుకు త్వరగా తిరిగిపోయిన సంఘము ఏది?
11. దేవుని సంఘములలో ఏ సంఘము గురించి అతిశయపడుచున్నానని పౌలు వ్రాసెను?
12 . సంఘము అను తన శరీరము కొరకు ఎవరు పాట్లు పడెను?
13 . ఏ సంఘమునకు దేవదర్శన మర్మములను పౌలు వ్రాసెను?
14 . మొదటి నుండి సువార్త విషయములో పౌలుతో పాలివారై యున్న సంఘము ఏది?
15 . సంఘము అను శరీరమునకు శిరస్సు యైన క్రీస్తు ఆదియై యుండి మృతులలో నుండి లేచుటలో ఏమియై యుండెను?
Result: