1Q. క్రుంగిపోయినవాడు సర్వశక్తుడగు దేవునియందు భయభక్తులు మాను కొనినను ఎవరు వానికి దయచూపతగును?
2. "సింహమువలెను ఆడు సింహమువలెను అతడు క్రుంగి పండుకొనెను అతనిని లేపువాడెవడు" ఈమాట ఎవరి గురించి చెప్పబడెను?
3Q. చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయువారి హృదయమును దేవుడు దేనిచేత క్రుంగజేసెను?
4 Q. తండ్రులారా, మీ పిల్లల మనస్సు క్రుంగకుండునట్లు వారికి ఏమి పుట్టింపకుడి?
5 Q. క్రుంగిపోయిన మోకాళ్లుగలవానిని దేవుడు ఏమి చేయును?
6Q. నా ప్రాణమా, నీవు ఏల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు ఏమి యుంచుము?
7Q. యెహోవా వేటివేటిని కలుగజేయువాడు క్రుంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే?
8 Q. "దేవుడు నా హృదయమును క్రుంగజేసెను, సర్వశక్తుడే నన్ను కలవరపరచెను" ఈమాట ఏ గ్రంథము లోనిది?
9 Q. క్రుంగబడినవాడు త్వరగా ఏమి పొందును?
10 Q. "నేను శ్రమచేత మిక్కిలి క్రుంగియున్నాను దినమెల్ల దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను" ఈమాట ఎవరు పలికెను?
11Q. యెహోవా ఎవరి కన్నులు తెరవజేయువాడు యెహోవా ఎవరిని లేవనెత్తువాడు?
2. "సింహమువలెను ఆడు సింహమువలెను అతడు క్రుంగి పండుకొనెను అతనిని లేపువాడెవడు" ఈమాట ఎవరి గురించి చెప్పబడెను?
13Q. జనములో ఎవరు అనేకులకు బోధించుదురు గాని వారు బహుదినములు ఖడ్గమువలనను అగ్ని వలనను క్రుంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు?
14 Q. "శ్రమదినమున నీవు క్రుంగినయెడల నీవు చేతకాని వాడవగుదువు" ఈ వాక్యము రిఫరెన్స్ ?
15 Q. ఒకని హృదయములోని విచారము దాని క్రుంగజేయును ఎటువంటి మాట దాని సంతోషపెట్టును?
Result: