1. ఇశ్రాయేలీయులు యూదా వారితో "క్రొత్త"నిబంధన చేయుచున్నానని యెహోవా ఎవరి ద్వారా వాక్కు నిచ్చెను?
2. తెలియని ఏమైన "క్రొత్త సంగతులను యెహోవా తెలియజేయుచున్నాననెను?
3. దేవుడు ఎవరికి "క్రొత్త"మనస్సును అనుగ్రహించెను?
4. "క్రొత్త"సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుటయందేమియులేదని పౌలు ఏ సంఘమునకు వ్రాసెను?
5. ఒకడు "క్రొత్తగా"జన్మించితేనే గాని ఏమి చూడలేడని యేసు చెప్పెను?
6. యెహోవా దినమందు ఎక్కడ నుండి "క్రొత్త"ద్రాక్షారసము పారును?
7. యెహోవా యాకోబును కక్కులు పెట్టబడి ఏమిగల"క్రొత్త"దైన నురిపిడి రాయిగా నియమించెను?
8. తనకు స్తోత్రరూపమగు "క్రొత్త"గీతమును దేవుడు నా నోట నుంచెను అని ఎవరు అనెను?
9. ఏమి మాని "క్రొత్తగా"జన్మించిన శిశువులను పోలినవారై యుండుమని పేతురు వ్రాసెను?
10. ద్వీపములు, ద్వీపనివాసులతో యెహోవాకు "క్రొత్త"గీతము పాడుమని ఎవరు చెప్పెను?
11. "క్రొత్త"ఆకాశమును "క్రొత్త"భూమిని ఏమి చేయుచున్నానని యెహోవా అనెను?
12. ఏది నా రక్తమువలనైన "క్రొత్త"నిబంధన అని యేసు తాను ఎత్తుకొనిన దాని గురించి అనెను?
13. ఎక్కడ ద్రాక్షారసమును మీతోకూడా "క్రొత్తదిగా" త్రాగు దినము వరకు త్రాగనని యేసు తన శిష్యులతో చెప్పెను?
14. ఏమి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను?
15. యెషయా ద్వారా ప్రవచింపబడిన "క్రొత్త" ఆకాశమును "క్రొత్త"భూమిని చూచినదెవరు?
Result: