Bible Quiz in Telugu Topic wise: 296 || తెలుగు బైబుల్ క్విజ్ ("క్షమాపణ" అనే అంశముపై క్విజ్)

1. యెహోవా మన దోషములన్నిటిని ఏమి చేయును?
ⓐ క్షమించును
ⓑ తీసివేయును
ⓒ తొలగించును
ⓓ పారవేయును
2. జనులు యెహోవా యందు ఏమి నిలుపునట్లు ఆయన యొద్ద క్షమాపణ కలదు?
ⓐ వినయము
ⓑ భయభక్తులు
ⓒ విధేయత
ⓓ మనస్సు
3. ఏమై యున్న ప్రభువు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు?
ⓐ గొప్పవాడు
ⓑ మంచివాడు
ⓒ దయాళుడు
ⓓ నమ్మకస్థుడు
4. జనుల దోషమును క్షమించి వారి యొక్క ఏమి జ్ఞాపకము చేసుకొననని యెహోవా వాక్కు నిచ్చెను?
ⓐ దుర్నీతి
ⓑ అక్రమము
ⓒ అవివేకము
ⓓ పాపములను
5. జనులు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారిని ఎలా క్షమించును?
ⓐ బహుగా
ⓑ ఎక్కువగా
ⓒ అధికముగా
ⓓ మిక్కిలిగా
6. యెహోవాకు విరోధముగా ఏమి చేసిన గాని ఆయన కృపాక్షమాపణ గల దేవుడై యున్నాడు?
ⓐ పొరపాటులు
ⓑ తిరుగుబాటు
ⓒ తప్పిదములు
ⓓ నేరములు
7 . ఎక్కడ శేషించిన వారి అతిక్రమములు దేవుడు క్షమించెను?
ⓐ తన దేశములో
ⓑ తన జనములో
ⓒ తన స్వాస్థ్యములో
ⓓ తన సేవకులలో
8 . ప్రజల దోషమును క్షమించమని వేడుకొనిన ఎవరి ప్రార్ధన విని దేవుడు ఇశ్రాయేలీయులను క్షమించెను?
ⓐ అహరోను
ⓑ ఎలియాజరు
ⓒ ఫీనెహాసు
ⓓ మోషే
9 . ఎవరి అపరాధములను మనము క్షమించిన యెడల పరలోకపు తండ్రి మన అపరాధములను క్షమించును?
ⓐ సోదరుల
ⓑ మనుష్యుల
ⓒ విశ్వాసుల
ⓓ దొంగల
10 . మన సహోదరులు మన యెడల తప్పిదము చేసినను వారిని ఎన్ని మారులు మట్టుకు క్షమించవలెనని యేసు చెప్పెను?
ⓐ పది యేళ్ళు
ⓑ నలువది యేళ్ళు
ⓒ డెబ్బది యేళ్ళు
ⓓ ముప్పది యేళ్ళు
11. నమ్మదగిన వాడును నీతిమంతుడైన దేవుడు మన పాపములను క్షమించి దేని నుండి పవిత్రపరచును?
ⓐ లోకబంధకముల
ⓑ చెడుకార్యముల
ⓒ వ్యర్ధసహవాసము
ⓓ సమస్తదుర్నీతి
12 . ఎవరిని దూషించువానికి క్షమాపణ లేదు?
ⓐ పరిశుద్ధాత్ముని
ⓑ మనుష్యకుమారుని
ⓒ సేవకులను
ⓓ దేవదూతలను
13 . ఎవరి యందు దేవుడు మనలను క్షమించును?
ⓐ సేవకులు
ⓑ క్రీస్తు
ⓒ ప్రవక్తలు
ⓓ బోధకులు
14 పాపములను క్షమించుటకు ఎవరికి భూమి మీద అధికారము కలదు?
ⓐ దీర్ఘదర్శులకు
ⓑ ప్రవక్తలకు
ⓒ మనుష్యకుమారునికి
ⓓ బోధకులకు
15 . తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని యేసు ఎక్కడనుండి పలికెను?
ⓐ ఒలీవ కొండ
ⓑ గెత్సెమనే తోట
ⓒ సముద్రతీరము
ⓓ సిలువపై
Result: