1. యెహోవా "క్షమించుటకు"సిద్ధమైన దేవుడని ఎవరు అనెను?
2. సహోదరుడు తప్పిదము చేసిన యెడల ఎన్ని ఏళ్ళ మారుల మట్టుకు "క్షమింప"వలెనని యేసు పేతురుతో చెప్పెను?
3. దుఃఖము కలుగజేసిన వానిని "క్షమించి" ఆదరించుమని పౌలు ఏ సంఘముతో చెప్పెను?
4. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల క్రీస్తు మనలను "క్షమించి"సమస్తదుర్నీతి నుండి మనలను ఏమి చేయును?
5. మనుష్యులు చేయు ప్రతి యొక్క ఏవి "క్షమింప"బడునని యేసు చెప్పెను?
6. మనుష్యుల యొక్క ఏమి మనము "క్షమించిన"యెడల పరలోకపు తండ్రియు మన యొక్క వాటిని "క్షమించును?
7. ప్రభువు నందు విశ్వాసముంచిన వాడు ఆయన నామము మూలముగా పాప"క్షమాపణ"పొందునని ఎవరు సాక్ష్యమిచ్చుచున్నారని పేతురు చెప్పెను?
8. రోగియైన వానికి ఎటువంటి ప్రార్ధన చేసినపుడు అతడు పాపములు చేసినవాడైతే పాప "క్షమాపణ"కలుగును?
9. ఎక్కడ నుండి మొదలుకొని సమస్త జనులలో క్రీస్తు పేరట పాప"క్షమాపణ"యు ప్రకటింపబడునని వ్రాయబడియున్నది?
10. పాప "క్షమాపణ"నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడని పేతురు వాక్యము చెప్పిన దినమున ఎంతమంది చేర్చబడిరి?
11. ప్రభువును విస్తారముగా ఏమి చేయునపుడు విస్తారపాపములు "క్షమించ"బడును?
12. పాపములు "క్షమించుటకు"భూమి మీద మనుష్యకుమారునికి అధికారము కలదని యేసు ఎవరిని తెలుసుకొనవలెననెను?
13. ఒకడు ఏమి చేసెనని అనుకొనిన యెడల ప్రభువు "క్షమించు"లాగున అతనిని "క్షమించ"వలెను?
14. దేవుని యొక్క దేనిని బట్టి ప్రియుడైన క్రీస్తు రక్తము వలన మన అపరాధములకు పాప"క్షమాపణ"కలిగియున్నది?
15. "క్షమించుడి", మీరు ఏమి ఏమి చేయబడుదురని యేసు అనెను?
Result: