1Q. యెహోవా - నీవు నా ఆజ్ఞలను ఆలకించినయెడల నీ "క్షేమము" దేనివలెను ఉండును?
2. ఎవరు భూమిని స్వతంత్రించుకొని బహు "క్షేమము" కలిగి సుఖించెదరు?
3. ఏమి జరిగించుటవలన రాజు దేశమునకు" క్షేమము "కలుగజేయును?
4Q. దేవుడు ఎవరిని "క్షేమము"నకు లేవనెత్తును?
5Q. తన జనులయొక్క "క్షేమమును" విచారించువాడును యూదులలో గొప్ప వాడునై తన దేశస్థులలో చాలామందికి ఇష్టుడుగా ఉన్నదెవరు?
6Q. నీకు 'క్షేమము" కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనమని యోసేపు ఎవరితో మనవి చేసెను?
7Q. ఏమినొందిన వానిని తిరస్కరించుట "క్షేమము"గల వారు యుక్తమనుకొందురు?
8 Q. ఫిలిప్పీ సంఘ "క్షేమము" తెలిసికొని ధైర్యము తెచ్చుకొను నిమిత్తము పౌలు ఎవరిని వారి యొద్దకు పంపెను?
9 Q ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటివలన "క్షేమము"గా బ్రదుకుచుండుటయే,వానికి---------?
10. మేఘమువలె నా " క్షేమము" గతించిపోయెను' అని ఎవరు అనెను?
11Q. నేను క్షేమము"గా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురమును పడగొట్టెదనని ఎవరు చెప్పెను?
12 Q. ఎవరు "క్షేమము" కలిగినదని మైమరచి నిర్మూల మగుదురు?
13.అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల "క్షేమము"ను ఏమైయున్నవి?
14. నీవు "క్షేమము" గా నీ పితరుల యొద్దకు పోయెదవు' అని యెహోవా ఎవరితో చెప్పెను?
15 Q. నా యింట విశ్రాంతియు నా నగరమందు "క్షేమము"ను గలవాడనైయుండి యొక కల కంటిని అది నాకు భయము కలుగజేసెనని ఎవరు పలికెను?
Result: