Bible Quiz in Telugu Topic wise: 3 || తెలుగు బైబుల్ క్విజ్ (Daughters day సందర్బంగా special క్విజ్)

1Q. నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసికొన్నదెవరు?
A రాజకుమారులు
B దేవుని కుమారులు
C దేవదూతలు
D సాతాను సంబంధులు
2Q. నాహోరు భార్యయైన మిల్కా ఎవరి కుమార్తె?
A షేతు
B అబ్రాహాము
C తెరహు
D హారాను
3Q. ఎవరి యొక్క యిద్దరు కుమార్తెలు తమ తండ్రివలన గర్భవతులైరి?
A లెమెకు
B మోతుషెల
C లోతు
D నోవహు
4 Q. కన్యకలుగా ఉన్న ప్రవచించు నలుగురు "కుమార్తెలు" ఎవరికుండెను?
A మార్కు
B ఫిలిపు
C పేతురు
D యోహాను
5 Q. " కుమార్తెలు" దేనికై చెక్కిన మూలకంబముల వలె ఉన్నారు?
A క్షేమమునకై
B బంగారమునకై
C వివేచనకై
D నగరునకై
6Q. మిద్యానీయుల అధిపతియైన నూరుకుమార్తె ఎవరు?
A కొజ్బీ
B రాయుమా
C మహేతబేలు
D మహలా
7 Q. లిబ్నా ఊరివాడైన యిర్మీయా కుమార్తె ఎవరు?
A కెజీయా
B నెవధ్యా
C హమూటలు
D ఎజెబేలు
8 Q. కాలేబు తన కుమార్తెయైన అక్సాను ఎవరికిచ్చి వివాహము చేసెను?
A జెరహీయులు
B హర్గీయులు
C ఒత్తినియేలు
D జనీయులు
9 Q. అబీహాయిలు కుమార్తెయును రాణియైన యూదురాలు ఎవరు?
A అబీయా
B యెరూష
C మాయకా
D ఎస్తేరు
10 Q. ఇశ్రాయేలీయులు తమలో ఎవడును తన కుమార్తెను బెన్యామీయుని కియ్యకూడదని ఎక్కడ ప్రమాణము చేసికొనియుండిరి?
A బేతేలులో
B హాయిలో
C మిస్పాలో
D ఐగుప్తులో
11Q. బహు సౌందర్యవతియైన అబ్షాలోము కుమార్తె ఎవరు?
A హమిత
B శెరహు
C తామారు
D మహలా
12Q. అంతఃపురములోనుండు రాజుకుమార్తె కేవలము ఏమి గలది?
A రాజ్యము
B మహిమ
C ఐశ్వర్యం
D ధనము
13Q. పనూయేలు కుమార్తెయునైన ప్రవక్త్ర అన్న ఏ గోత్రికురాలు?
A యూదా
B బెన్యామీను
C ఆషేరు
D గదు
14.గూటినుండి చెదరి ఇటు అటు ఎగురు పక్షులవలె అర్నోను రేవులయొద్ద ఎవరి కుమార్తెలు కనబడుదురు?
A యెరూషలేము
B మోయాబు
C మీద్యను
D ఇశ్రాయేలు
15Q. ఊజు దేశమందంతటను ఎవరి కుమార్తెలంత సౌందర్యవతులు కనబడలేదు?
A షమ
B హాము
C యోబు
D కనాను
Result: