Bible Quiz in Telugu Topic wise: 301 || తెలుగు బైబుల్ క్విజ్ ("ఖడ్గము" అనే అంశము పై బైబిల్ క్విజ్)

1. ఇశ్రాయేలు వారు నీ ప్రవక్తలను "ఖడ్గము"చేత హతము చేసిరి అని ఎవరు యెహోవాతో అనెను?
ⓐ ఎలీషా
ⓑ యెహూ
ⓒ హనానీ
ⓓ ఏలీయా
2. మనుష్యులలో ఉండకుండ ఎవరిని నశింపజేయునట్లు "ఖడ్గము"వంటి పళ్లును గల తరము కలదు?
ⓐ బీదలను
ⓑ విధవరాండ్రను
ⓒ వృద్ధులను
ⓓ రోగులను
3 . యెహోవా "ఖడ్గము" ఎక్కడ మత్తిల్లును?
ⓐ భూమిమీద
ⓑ ఆకాశమందు
ⓒ పర్వతములమీద
ⓓ కొండలమీద
4 . మత్తిల్లిన యెహోవా "ఖడ్గము"దేని మీద తీర్పు తీర్చుటకు దిగును?
ⓐ మోయాబు
ⓑ ఐగుప్తు
ⓒ ఎదోము
ⓓ అష్షూరు
5. రక్తము ఓడ్చకుండా "ఖడ్గము" దూయువాడు ఏమగును?
ⓐ బలహీనుడు
ⓑ శక్తిలేనివాడు
ⓒ పిరికివాడు
ⓓ శాపగ్రస్తుడు
6. దేనిని "ఖడ్గము"తరుముచున్నది?
ⓐ బేయేరును
ⓑ సల్మానును
ⓒ మద్మేనాను
ⓓ బేత్షేమెషును
7. "ఖడ్గము"దేని చుట్టు నున్న ప్రదేశములను మ్రింగివేయుచున్నదని యెహోవా ప్రకటన చేయమనెను?
ⓐ తూరును
ⓑ ఐగుప్తును
ⓒ బేతేలును
ⓓ బెర్మాయాను
8. యెహోవా తన శత్రువులకు ఏమి చేయు దినమున "ఖడ్గము"కడుపారా తినును?
ⓐ. తీర్పు
ⓑ శిక్ష
ⓒ ప్రతిదండన
ⓓ ప్రతీకారము
9 . "ఖడ్గమును"యెహోవా తన యొక్క ఎవరి మీద పడుము అని అనెను?
ⓐ ప్రవక్తల
ⓑ దీర్ఘదర్శుల
ⓒ గొర్రెలకాపరుల
ⓓ రాజుల
10 . ఎటువంటి "ఖడ్గమును"తప్పించుకొందము రండని అనేకులు చెప్పుకొందురు?
ⓐ క్రూరమైన
ⓑ బలమైన
ⓒ గొప్పదైన
ⓓ పదునైన
11. యెహోవా "ఖడ్గమా, "యెంత వరకు విశ్రమింపకుందువని ఏ ప్రవక్త అనెను?
ⓐ యెహెజ్కేలు
ⓑ యిర్మీయా
ⓒ జెకర్యా
ⓓ యెషయా
12. ఐగుప్తు దేశములో కాపురముందుమని వెళ్లిన యూదాశేషులు యెహోవా యొక్క "ఖడ్గము"వలన ఏమగుదురు?
ⓐ నశింతురు
ⓑ చత్తురు
ⓒ కూలుదురు
ⓓ పైవన్నీ
13. యెహోవా "ఖడ్గము"ఏమగును?
ⓐ రక్తమయము
ⓑ కోపమయము
ⓒ ఆగ్రహమయము
ⓓ క్రోధమయము
14. యెహోవాతన శత్రువులకు ప్రతిదండన చేయు దినమున "ఖడ్గము" ఎలా రక్తము త్రాగును?
ⓐ కడుపారా
ⓑ మనస్సారా
ⓒ తనివితీర
ⓓ తృప్తిగా
15. ఎక్కడికి పొమ్మని యెహోవా "ఖడ్గమునకు "ఆజ్ఞ ఇచ్చెను?
ⓐ బబులోను మీదికి
ⓑ తూరు మీదికి
ⓒ ఐగుప్తు మీదికి
ⓓ అష్కెలోను మీదికి
Result: